వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌.


అమరావతి (ప్రజా అమరావతి)


*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*


*ఇప్పటికే వరుసగా ఐదో ఏడాది.. ఈ ఏడాదికి మొదటి విడతగా..**రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం అందించిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.*


*వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లో రూ. 3,923.21 కోట్ల రైతు భరోసా సాయాన్ని నేడు (01.06.2023) కర్నూలు జిల్లా పత్తికొండలో విడుదల చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌. బటన్‌ నొక్కిన వెంటనే రైతు భరోసా సాయం కింద రూ.5,500 రైతన్నల ఖాతాల్లో జమ... పీఎం కిసాన్ క్రింద రావాల్సిన రూ. 2,౦౦౦ కూడా ఆ నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో...*


దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం, ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 3,923 కోట్లతో కలిపి ఈ నాలుగేళ్లలో శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం మాత్రమే రూ. 30,985 కోట్లు.


చెప్పిన దానికన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం.

మ్యానిఫెస్టోలో చెప్పింది – ఏటా రూ. 12,500 – 4 సంవత్సరాలు – రూ. 50,000.

శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్నది ఏటా రూ. 13,500 – 5 సంవత్సరాలు – రూ. 67,500.

రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ. 17,500.


రైతు భరోసా క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500.

మొదటి విడత – ఖరీఫ్‌ పంట వేసే ముందు – మే నెలలో రూ. 7,500.

రెండవ విడత – అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోత సమయం మరియు రబీ అవసరాల కోసం రూ. 4,000.

మూడవ విడత – పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి–ఫిబ్రవరి నెలలో రూ. 2,000.


గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా ఈ నాలుగేళ్లలో రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన సాయం రూ. 1,61,236.72 కోట్లు.


రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్‌ రైతు భరోసా, విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్‌ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, కనీస మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం, పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, 5 రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరల ప్రకటన, రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. ఏడాది పొడవునా వర్షాలు, సమృద్ధిగా  పంటలు, ఒక్క కరవు మండలం ప్రకటించే పరిస్థతి కూడా రాలేదు.


గత ప్రభుత్వంలో అరకొరగా విత్తనాలు, ఎరువుల పంపిణీ, బీమా క్లెయిమ్‌లు ఎప్పుడు వస్తాయో, ఎంతమందికి వస్తాయో, ఎంతవస్తాయో తెలియని పరిస్థితి. అయినవారికే పరిహారం, ఏడాది పొడవునా కరవు, ఐదేళ్లలో 1,623 కరవు మండలాల ప్రకటన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచన లేదు.*రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ*

2023 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలకు 30,382 హెక్టార్లలో పంట నష్టపోయిన 47,999 మంది రైతులకు రూ.44.19 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట కోతల అనంతరం వర్షాల వల్ల కల్లాల్లో పంట దెబ్బతిన్న 3,469 మంది జొన్న, మొక్కజొన్న రైతులకు రూ.9.43 కోట్ల ప్రత్యేక పరిహారంతో కలిపి రూ.53.62 కోట్ల పెట్టుబడి రాయితీ.. గ్రామ స్థాయిలోని ప్రతి ఆర్బీకేలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి నష్టపోయిన రైతులను పారదర్శకంగా గుర్తించి బటన్‌ నొక్కి నేడు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి.


*నేడు జమ చేస్తున్న రూ. 53.62 కోట్లతో కలిపి శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 22.74 లక్షల మంది రైతన్నలకు అందించిన మొత్తం ఇన్‌పుట్‌ సబ్సిడీ అక్షరాల రూ. 1,965 కోట్లు.*


రైతన్నకు అండగా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం...ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి పరిహారం అందాలి, అదీ సకాలంలో అందాలి. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారం చెల్లిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ...రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.


*మన ప్రభుత్వంలో నేడు...* 

*రైతు భరోసా:* ఏటా 3 విడతల్లో "రైతు భరోసా–పీఎం కిసాన్‌’’ ద్వారా రూ.13,500 పెట్టుబడి సాయం.. ఈ నాలుగేళ్లలో 52,30,939 మంది రైతన్నలకు అందించిన రైతు భరోసా–పీఎం కిసాన్‌ సాయం రూ.30,985 కోట్లు..

*రైతు భరోసా కేంద్రాలు:* విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతన్నకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్‌ స్టాప్‌ సెంటర్లుగా 10,778 ఆర్బీకేలు..


*ఉచిత పంటల బీమా:* రైతులపై భారం లేకుండా పూర్తి ప్రీమియం బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని బీమా రక్షణ.. ఒక సీజన్‌ పరిహారం మరుసటేడాది అదే సీజన్‌ రాక ముందే.. 


*పంట నష్టపరిహారం:* ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా శాస్త్రీయంగా పంట నష్టాలు అంచనా వేసి ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం..


*సున్నా వడ్డీ పంట రుణాలు:* ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకొని ఏడాది లోపు తిరిగి చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ రాయితీ..

వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌.. సరఫరాలో నాణ్యత పెంచేందుకు రూ.1700 కోట్లతో ఫీడర్లు, సబ్‌ స్టేషన్ల ఆధునీకరణ..


*ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ:* యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.1.50కే.. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు రూ.452 కోట్లతో కలిపి ఇప్పటికే రూ.2,968 కోట్ల చెల్లింపు.


*అమూల్‌తో ఒప్పందం:* పాడి రైతులకు మేలు చేస్తూ అమూల్‌తో ఒప్పందం ద్వారా రైతన్నలకు ప్రతి లీటరుపై రూ.10 నుండి రూ. 17 వరకు అదనపు ఆదాయం.. పశువులకు కూడా అంబులెన్స్‌ సేవలు, ఉచిత బీమా.. మహిళా పాడి రైతు సంఘాల బలోపేతం..


*గత ప్రభుత్వంలో –నాడు..* 

రైతు భరోసా లేదు. రైతన్నకు సకాలంలో సాయం అందించాలన్న ఆలోచన లేదు.. వారిని పట్టించుకున్న నాథుడు లేడు.. 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో మాటిచ్చి దిగిపోయే నాటికి 15 వేల కోట్లు మాత్రమే చెల్లించిన దుస్థితి..

రైతు భరోసా కేంద్రాలు లేవు.. గ్రామ స్థాయిలో రైతులకు కనీస సేవలు అందుబాటులో లేని పరిస్థితి..

బీమా క్లెయిమ్‌లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో, ఎంతమందికొస్తాయో కూడా తెలియని దుస్థితి..! ప్రీమియం సైతం రైతులే చెల్లించాల్సిన పరిస్థితి..

అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా.. రైతన్నలు ఆఫీసుల చుట్టూ తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి.. లంచాలు, వివక్ష..

రైతులకు రూ.1180 కోట్ల వడ్డీ బకాయిలు పెట్టి 2016–17 నుండి సున్నా వడ్డీ పథకాన్ని నిర్వీర్యం చేసిన దుస్థితి..

వేళాపాళ లేకుండా రైతులకు విద్యుత్‌ సరఫరా.. ఆ విద్యుత్‌ సరఫరాలోనూ నాణ్యత లోపం కారణంగా మీటర్లు కాలిపోయిన పరిస్థితి..ఉచిత విద్యుత్‌ను నీరుగారుస్తూ రూ.8,845 కోట్లు బకాయి పెట్టిన పరిస్థితి..

ఎన్నికలకు 2 నెలల ముందు సబ్సిడీపై రూ.2లకే యూనిట్‌ విద్యుత్‌ ఇస్తామని చెప్పి రూ.451.77 కోట్లు ఎగ్గొట్టిన దుస్థితి..

పాడి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.. తమ వర్గానికి చెందిన ప్రైవేట్‌ డెయిరీలకు మాత్రమే మేలు కలిగేలా చర్యలు.. పశువులకు అంబులెన్స్‌ వ్యవస్థ, ఉచిత బీమా లేవు..

Comments