ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన భారత్‌లో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌.



ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ.


ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం.


సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం.


మ్యానుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ సస్టెయినబిలిటీ, సస్టెయినబుల్‌ ప్రాక్టీసెస్, ఆటోమెటివ్‌ అండ్‌ ఇంజినీరింగ్, జాయింట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఐటీ అండ్‌ డిజిటలైజేషన్, స్టార్టప్‌ ఎకో సిస్టమ్, ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ప్రోగ్రామ్స్, ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌  వంటి వివిధ రంగాలలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్, ఏపీని ఫోకస్డ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు వెల్లడి.


ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, జర్మనీ రాయబార కార్యాలయ అధికారులు.

Comments