రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలి.

 

నెల్లూరు: మే.8 (ప్రజా అమరావతి);

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. హరి నారాయణన్ అధికారులను ఆదేశించారు.

స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మనాద్ ,అడిషనల్ ఎస్పీ హిమవతి, లతో కలసి జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి పర్యటనకు చేయవలసిన ఏర్పాట్లపై కలెక్టర్ సోమవారం ఆదేశాలు ఇచ్చారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించినందున భూములకు సంబందించిన పట్టాలను రైతులకు అందించేందుకు ముఖ్యమంత్రి 12వ తేదీన కావలి వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా సాగటానికి వీలుగా హెలిపాడ్ , బహిరంగ సభ జరిగే ప్రదేశాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్య మంత్రి పర్యటనకు  ఓవరాల్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్ కుబాధ్యతలు ఇచ్చామన్నారు . హెలిపాడ్ ఇంచార్జిగా ఆత్మకూరు ఆర్డిఓ కరుణ కుమారి కు బాధ్యతలు అప్పగించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు .బహిరంగ సభ వేదిక వేదికపై నుడా వి సి .బాపిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సుస్మితలను ఏర్పాట్లూచేయాలని సూచించారు గాలరీలో వుండే లబ్ది దారులకు, సభికులకు ఇబ్బంది లేకుండా చూడాలని zp సి ఇ ఒ కు సూచించారు.. హెలిపాడ్ వద్ద, బహిరంగ సభ వద్ద పటిష్టమైన బారికెడ్లు ఏర్పాటు చేయాలని అర్ & బి  ఎస్ ఈ  ను ఆదేశించారు. పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచాలని కావలి కమిషనర్ కు సూచించారు. విద్యుత్ సరఫరాకు ఏ విధ మైన అంత రాయం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అవసరమైన జనరేటర్లు ఏర్పాట్లు చేయాలని ఎలక్ట్రికల్ యస్ . ఈ కి సూచించారు. సభకు వచ్చే ప్రజలకు,అల్పాహారం, స్నాక్స్,భోజనం ఎర్పాటు చేయాలన్నారు.వేసవి దృష్ట్యా బహిరంగ సభ వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో త్రాగునీరు తగినంతగా ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఎస్. ఈ  ఆర్డబ్ల్యూఎస్ కు సూచించారు . పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎల్ ఈ డి స్క్రీన్లు, లైవ్ కవరేజ్ కు ఏర్పాట్లు చెయ్యాలని సమాచార శాఖ అధకారులకు సూచించారు.

ఈ సమావేశంలో DRO వెంకట నారాయణమ్మ, RDO లు సీనా నాయక్ , మాలొల,,పిడి డి ఆర్ డి ఎ. సాంబశివా రెడ్డి, Bsnl, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.

Comments