కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించేవిధంగా అన్ని చర్యలు



  తాడేపల్లిగూడెం,అత్తిలి, (ప్రజా అమరావతి);

 


 *కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించేవిధంగా అన్ని చర్యలు


తీసుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియో గదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరరావు అన్నారు*...


  ఆదివారం తాడేపల్లిగుడెం ,అత్తిలి భీమవరం  మండలాల  లోని పలుగ్రామాలలో మంత్రి పర్యటించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని  పరిశీలించారు.

 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు వద్ద ఉన్న ధాన్యం మిల్లులకు వెంటనే తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు  అకాల వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, కోసిన ధాన్యం కోసినట్లు మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.   గోనె సంచులు మన అవసరం మేరకు అందుబాటులోకి వచ్చాయని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే తరలించే విధంగా   చర్యలు తీసు కున్నామని  అయన తెలిపారు. ధాన్యం మిల్లిలో దింపుకోడానికి ఏ రైతైనా ఇబ్బంది పెడితే తక్షణమే తనకు  ఫోన్ చేయాలని మంత్రి అన్నారు. ఇప్పటికే జిల్లాలో తొమ్మిది రైస్  మిల్లులను సీజ్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు  మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.  ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు రైస్ మిల్లర్లకు సంబంధం లేదనే విషం తెలియక, ఇంకా రైతులు అపోహ పడుతున్నారని అన్నారు.  రైతులు ఆర్ బి కే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచినా వెళ్లవలసిన అవసరం లేదన్నారు.  కొంతమంది మిల్లర్లు రైతులకు ఫోన్ చేసి  నూక అవుతుంది మిల్లుకు రావాలని పిలుస్తున్నారనే  ఫిర్యాదు వస్తే  అట్టి మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు . కృష్ణాజిల్లాలో, ఏలూరు జిల్లాలో ఉన్న బాయిల్డ్ రైస్ మిల్లులకు,  డ్రైయర్ లు  ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు .అకాల వర్షంతో   రైతుల వద్ద  ఉన్న ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  దళారీలు లేకుండా  ప్రతి రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర రూ 1530 రూపాయలు రైతుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు .  రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.  దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి తీసుకున్న  చర్య  ముఖ్యమైనదని ఆయన అన్నారు.  రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతుల పట్ల మెసలి  కన్నీరు కారుస్తున్నారని వారు అధికారంలో ఉండగా రైతులను పట్టించుకోలేదని వారి అధికారంలో ఉండగా చెల్లించాల్సిన బకాయిలు కూడా ఎగ్గొట్టారని , ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగిందని మంత్రి అన్నారు.


 ఈ కార్యక్రమంలో అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్ బుద్ధరాతి ప్రసాద్ , తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ ఏ డి మురళీకృష్ణ, తాసిల్దార్లు, సంబంధిత అధికారులు,  స్థానిక నాయకులు,  రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Comments