ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులను అక్కున చేర్చుకున్నారు.

నెల్లూరు (ప్రజా అమరావతి);

కావలి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులను అక్కున చేర్చుకున్నారు.


తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న వికలాంగులను ప్రత్యేకంగా హెలిపాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకుని, వారి సమస్యలను ఆలకించారు. ఏడుగురు దివ్యాంగులు  ముఖ్యమంత్రికి తమ ఆవేదన వెలుబుచ్చుకున్నారు. వీరి సమస్యలను ఆలకించిన ముఖ్యమంత్రి తక్షణసాయంగా రూ లక్ష రూపాయలు అందించి, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఏడుగురు దివ్యాంగులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్, ఆర్డీవో  సీనా నాయక్ సమక్షంలో దివ్యాంగులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి  లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్  హరి నారాయణన్ ప్రత్యేకంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకుని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 


ముఖ్యమంత్రిని కలిసిన దివ్యాంగుల వివరాలు


1). మర్రిపూడి సుబ్బారావు

తండ్రి తిరుపాలు

మెదరమెట్లపాలెం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా.

( రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతిని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోగా, సాయంగా ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు) 


2). బత్తిన షణ్ముఖ కుమార్

తండ్రి శ్రీనివాసులు

కలిగిరి, కలిగిరి మండలం

( జన్యుపరమైన సమస్యతో ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలవగా, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు) 


3). దుగ్గిరాల రాఘవ

తండ్రి ముసలయ్య

కలవల్ల గ్రామము, వలేటివారిపాలెం మండలం

ప్రకాశం జిల్లా

( రెండు కిడ్నీలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్నాడు.  గ్రామ సర్పంచిగా పనిచేస్తున్నాడు. 38 సంవత్సరాల వయసు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కిడ్నీలు మార్పు చేయవలసి ఉన్నది. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలవగా, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు) 


4). నోసం అమూల్య

తండ్రి హుస్సేన్ భాష

సర్వేపల్లి

( అరుదైన వ్యాధితో బాధపడుతుంది. రాయ వేలూరు లో వైద్యం చేయిస్తున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి కలవగా లక్ష రూపాయలు సాయం చేశారు.) 


5). పిడతల నాగరాజు

తండ్రి రామకృష్ణ

వేల్పుచర్ల వారి పల్లి గ్రామం,

లక్కిరెడ్డిపల్లి మండలం

అన్నమయ్య జిల్లా.

( ఒక కాలు, ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయి ఎటువంటి పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రిని కలవగా, లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు) 


6). పోసిన వెంకట్రావు

తండ్రి వెంకటేశ్వర్లు

చెంచు గారి పాలెం, కావలి

( షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మందులకు ప్రతినెల ఎక్కువగా ఖర్చు అవుతుంది. సీఎం గారి దృష్టికి  సమస్యలు తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన సీఎం  లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు) 


7. వెంకట అఖిల్ 

ఊట్లపాలెం, పొదలకూరు మండలం, నెల్లూరు. 

( వెన్నెముక ఆపరేషన్ చేసి ఆరోగ్యం సరిగా లేక బాధపడుతున్నాడు. మరింత మెరుగైన ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోగా, తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు.) 


Comments