నిత్యం తీసుకునే ఆహారం లో చిరు ధాన్యాలు తీసుకోవాలి.





రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


** నిత్యం తీసుకునే ఆహారం లో చిరు ధాన్యాలు తీసుకోవాలి



** ఆకట్టుకున్న చిరు ధాన్యాలు, ఆహార పదార్థాల ప్రదర్శన



** చిరు ధాన్యాలు ఆహార భద్రత కరపత్రాలు ఆవిష్కరణ


. జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత . 



2023 అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో అధికారులకు అవగాహన కల్పించడం లో భాగం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత  పేర్కొన్నారు.


సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో మిల్లెట్స్ ప్రదర్శనను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నిత్యం మనం తీసుకునే ఆహార అలవాట్లలో చిరు ధాన్యాల వాడకం అలవాటు గా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం సాధ్యం అవుతుందని అన్నారు. మన నుంచి మన వారసులు మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు చైతన్యం తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023 ను అంతర్జాతీయ మిల్లెట్స్ ఏడాదిగా ప్రకటించిన నేపథ్యంలో దేశంలో తొమ్మిది రకాలైన చిరు ధాన్యాలు సాగు చేసేందుకు లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఆమేరకు తూర్పు గోదావరి జిల్లాలో జొన్నలు సాగు లక్ష్యం ఇవ్వడం జరిగిందన్నారు.  ఇకపై స్పందన సందర్భంగా అధికారులకు చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఇస్తామని తెలిపారు. మన నుంచే మార్పు ప్రారంభం కావాలని పిలుపు నిచ్చారు. మంచి పౌష్టికత కలిగి ఉన్న చిరు ధాన్యాలు వినియోగం, శరీర వ్యాయామ పద్ధతులు ద్వారా జన్యు పరంగా వచ్చే వ్యాధులను కూడా నయం వేసే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. 


జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, చిరు ధాన్యాలు యొక్క అవశ్యకతను ఐక్య రాజ్య సమితి గుర్తించి, ఈ ఏడాదిని మిల్లెట్స్ ఏడాదిగా ప్రకటించారని తెలిపారు. ఆరు రకాలైన చిరు ధాన్యాలు కొర్రలు, వరిగలు, సామాలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలకు  రూ.2500 మేర మద్దతు ధర ప్రకటించడం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులకు భరోసా ఇవ్వడం జరిగిందని అన్నారు. బిపి, సుగర్, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు చిరు ధాన్యాలు వాడకం ద్వారా సాధ్యం అవుతున్న సందర్భాలు ఉన్నాయని అధికారులు వివరించారు.



చిరు ధాన్యాల ప్రదర్శన ప్రారంభం:


కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిరు ధాన్యాలు ప్రదర్శన లో భాగంగా...2023 అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం పూలతో అలంకరించిన ప్రదర్శన, రైతులు చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ద్వారా చిరు ధాన్యాలు ఆహార భద్రత కరపత్రాలతో సంక్షిప్త సమాచారం అందించడం ద్వారా చైతన్యం తీసుకుని వస్తున్నట్లు తెలియ చేసారు.  తొలుత చిరు ధాన్యాలతో కూడి పూలతో అలంకరించి ప్రదర్శన, చిరు ధాన్యాలు తో తయారు చేసిన ఆహార పదార్థాలను సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు.



ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




Comments