*మండల స్థాయిలో పరిష్కారమయ్యే ప్రతి గ్రీవెన్స్ ని ఖచ్చితంగా పరిష్కరించాలి
*
*: గ్రీవెన్స్ కి నాణ్యత కలిగిన పరిష్కారం అందించామా లేదా అనేది ప్రతి ఒక్కరూ పరిశీలన చేయాలి*
*: గ్రీవెన్స్ కి నాణ్యమైన పరిష్కారం కల్పించడం అత్యంత కీలకం*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి) :
*మండల స్థాయిలో పరిష్కారమయ్యే ప్రతి గ్రీవెన్స్ ని ఖచ్చితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 109 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు సమయానికి రావాలని, ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా కార్యక్రమానికి హాజరవాల్సిందేన్నారు. కొంతమంది జిల్లా అధికారులు రెండు జిల్లాలకు పని చేస్తున్నారని, ఒకవారం అనంతపురంలో, మరోవారం శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. స్పందన కార్యక్రమానికి రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, అనంతరం పంచాయతీరాజ్, హౌసింగ్, తదితర 7, 8 శాఖలకు సంబంధించి 90 శాతం వరకు గ్రీవెన్స్ వస్తున్నాయన్నారు. వచ్చిన గ్రీవెన్స్ లో ఎక్కువగా రీఓపెన్ అవుతున్నాయని, అన్ని శాఖల నుంచి గ్రీవెన్స్ పరిష్కరించేలా ఒక సీనియర్ లేదా జూనియర్ అసిస్టెంట్ ని నియమించాలని, వచ్చిన గ్రీవెన్స్ ని ఆ శాఖ పరిధిలోని అధికారికి తెలియజేసి గ్రీవెన్స్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన పరిష్కారం అందించి గ్రీవెన్స్ ను సకాలంలో పరిష్కరించేలా చూడాలని, సమస్యలు తగ్గించేలా పరిష్కారం ఉండాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి గ్రీవెన్స్ తక్కువగా వస్తున్నాయని, మండల అధికారులు అంతా కలిసి పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో ఈ వారంలో మండల స్థాయిలో చేయాల్సిన అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలను గురించి ఆయా శాఖల అధికారులు సమీక్ష చేసుకోవాలన్నారు. సమన్వయంతో పనిచేసి మండల స్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.*
*జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాష్ బోర్డు నుంచి మాట్లాడతారని, ప్రభుత్వం స్పందనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో పరిష్కారమయ్యే ప్రతి గ్రీవెన్స్ ని ఖచ్చితంగా పరిష్కరించాలన్నారు. స్పందన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్రీవెన్స్ కి నాణ్యత కలిగిన పరిష్కారం అందించామా లేదా అనేది ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోవాలన్నారు. మండల స్థాయిలో నాణ్యత కలిగిన పరిష్కారం అందిస్తే ఆర్డీవో, ఇతర పై స్థాయికి గ్రీవెన్స్ అర్జీలు రావని, క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రీవెన్స్ పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. స్పందనలో అర్జీలు ఎలా తీసుకోవాలి, వాటిని నాణ్యతగా ఎలా పరిష్కరించాలి, గడువులోపు పరిష్కరించడం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి చక్రధర్ బాబును జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం నియమించడం జరిగిందని, ఈనెల మూడవ తేదీ ఆయన జిల్లాకు రానున్నారని, స్పందన పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని, ఇందుకోసం జిల్లా అధికారులంతా సన్నద్ధం కావాలన్నారు. కొత్త జిల్లా ఏర్పడిన అనంతరం ఏడాది కాలంలో వచ్చిన గ్రీవెన్స్ ఎలా ఎండార్స్మెంట్ ఇచ్చి పరిష్కరించడం జరిగింది అనేది చూసుకోవాలని, పెండింగ్ ఉన్న గ్రీవెన్స్ కు వెంటనే నాణ్యమైన ఎండార్స్మెంట్ ఇచ్చి పరిష్కరించాలన్నారు. అధికారులంతా స్పందన గ్రీవెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేయాలని ఆదేశించారు.*
*ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైనా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవనాలకు సంబంధించి గ్రౌండ్ కానిది వెంటనే గ్రౌండింగ్ చేయాలని, బేస్మెంట్, ఆర్ ఎల్ స్థాయిలో ఉన్నవి ఆగస్టు 30వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని, గ్రౌండ్ చేసిన అనంతరం జిజిఎంపి పోర్టల్ లో అప్లోడ్ చేయాలని, వచ్చే శనివారం లోపు 100 శాతం పనులు గ్రౌండింగ్ చేయడం పూర్తి కావాలన్నారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ప్రతి వారం కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు.*
*ఈనెల 2వ తేదీన మంగళవారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్ జిల్లాకు రానున్నారని, మంగళవారం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్ పై ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు, డిఈలు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని, ఇందుకు సంబంధించి అధికారులు అంతా నివేదికల సిద్ధం చేసుకుని రావాలన్నారు. డ్వామా పరిధిలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి రూ.7 కోట్ల బిల్లులను సోమవారం సాయంత్రం లోపు అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన పలు అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.*
1. లేపాక్షి మండలం కంచి సముద్రం గ్రామానికి చెందిన చిన్నప్పయ్య మాట్లాడుతూ లేపాక్షి నుంచి కంచిసముద్రం గ్రామానికి వెళ్లే రోడ్డు శిథిలావస్థకు చేరుకుందని, ఇటీవల కురిసిన వర్షాలకు తారు రోడ్ లో గుంతలు ఏర్పడ్డాయని, దీంతో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని, రోడ్డు బాగోలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని విన్నవించారు.
2. ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ గ్రామ సర్వే నంబర్ 777-2 లో 3.82 ఎకరాల భూమిని గత 30 ఏళ్లుగా చదును చేసుకుని స్వాధీనానుభవంలో ఉండగా, సదరు పొలాన్ని లక్ష్మీకాంతమ్మ పేరుమీద ఖాతా నెంబర్ 836 మేరకు డి పట్టాగా వెబ్ల్యాండ్ లో నమోదు చేశారని, తాను సదరు పొలాన్ని భూ పంపిణీలో డిపట్టా నిమిత్తం దరఖాస్తు చేసుకున్నానని, తనకు న్యాయం చేయాలని విన్నవించింది.
3. తలపుల మండలం గజ్జలప్ప గారి పల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి మాట్లాడుతూ తనకు గ్రామ సర్వేనెంబర్ 415 లో రెండు ఎకరాల భూమి ఉందని, తన భూమికి వెళ్లేందుకు నా తమ్ముళ్లు అడ్డు చెప్తున్నారని, ఈ సర్వే నెంబర్ లో తనకు రాస్తా చూపించి న్యాయం చేయాలని విన్నవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిపిఓ విజయ్ కుమార్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిఈఓ మీనాక్షి, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment