టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసిన గన్నవరం టీడీపీ కార్యకర్తలు, నేతలు.*టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసిన గన్నవరం టీడీపీ కార్యకర్తలు, నేతలు


*


అమరావతి (ప్రజా అమరావతి):- గన్నవరంలో వైసీపీ అక్రమ కేసుల్లో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజు ఉండవల్లిలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 20వ తేదీన వైసీపీ రౌడీ మూకలు గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. కార్యాలయంలో ఉన్న కార్లు, ఇతర వాహనాలను తగులబెట్టారు. కార్యకర్తలపై దాడులు చేశారు. అయితే నాటి దాడులకు పాల్పడిన వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోకుండా... బాధితులైన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన సెక్షన్ లతో కేసులు పెట్టారు. స్థానిక సిఐతో పాటు వైసీపీ కార్యకర్తల ఫిర్యాదులు ఆధారంగా 27 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు పై అక్రమ కేసులు పెట్టారు. హత్యాయత్నం, అట్రాసిటీ వంటి సెక్షన్ లు జోడించి 13 మందిని జైలుకు పంపారు. కోర్టుకు వెళ్లడం ద్వారా మరో 14 మంది ముందస్తు బెయిల్ పొందారు. ఈ రోజు ఉండవల్లిలో పార్టీ అధినేతతో భేటీ అయిన వీరంతా.....నాటి కేసులు, పోలీసుల, వైసీపీ నేతల వేధింపులు, బెదిరింపులను వివరించారు. అరెస్టు సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరును ప్రత్యేకంగా అధినేత దృష్టికి తెచ్చారు. అక్రమ కేసుల విషయంలో పార్టీ అండగా ఉంటుందని.. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు వారికి సూచించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.....పార్టీ అన్నిటికీ సమాధానం ఇస్తుందని నేతలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ధైర్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని వారికి  చంద్రబాబు నాయుడు సూచించారు.

Comments