నేడే గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల ప్రశంసా కార్యక్రమం ...

 నేడే గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల ప్రశంసా కార్యక్రమం* ...


*విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి* ...


*జిల్లాలో సత్కారాలకు 8490  మంది ఎంపిక* ...


*పనితీరు  ఆధారంగా మూడు కేటగిరీలలో అవార్డులు* ..


*సేవా వజ్ర అవార్డుకు ఎంపికైన 34మందికి రూ. 30  వేల చొప్పున పురస్కారాలు* ...


*19 3మంది సేవారత్న పురస్కారం గ్రహీతలకు రూ. 20 వేల నగదు* ...


8263 మంది సేవామిత్ర పురస్కారం గ్రహీతలకు రూ. 10 వేల నగదు* ..


*నియోజకవర్గాల్లో స్ధానికంగా వాలంటీర్లను సత్కరించేలా 10 రోజుల కార్యక్రమం* ...

 

  పుట్టపర్తి,మే,18 (ప్రజా అమరావతి): గ్రామ,వార్డు వాలంటీర్ల ప్రశంసా కార్యక్రమం 2023 కింద  శ్రీ సత్య సాయి జిల్లాలో సత్కారాలకు 8490మందిని ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు తెలిపారు.  


గౌ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈనెల 19వ తేదీ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  


ఈ నేపథ్యంలో  కలెక్టరేట్ లోని  స్పందనలోని సమావేశ మందిరంలో ఈ నెల 19వ తేది శుక్రవారం ఉదయం 10.00 గంటలకు వాలంటీర్ల ప్రశంసా కార్యక్రమం నిర్వహించనున్నారు.  

వాలంటీర్ల ప్రశంసా కార్యక్రమానికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరు ఆధారంగా మూడు కేటగిరీలలో అవార్డులు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు.   జిల్లాలో సేవావజ్ర అందుకునే 34మందికి ఒక్కొక్కరికి రూ. 30 వేల నగదు చొప్పున, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీ, మెడల్ తో ప్రశంసించడం జరుగుతుందన్నారు.  సేవారత్న అందుకునే 193 మందికి రూ. 20 వేల నగదు చొప్పున  సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీ, మెడల్ అందించబడుతుందని, సేవామిత్ర అందుకునే 8263 మందికి రూ. 10 వేల నగదు చొప్పున  సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జీ, మెడల్ ఇవ్వబడుతుందన్నారు. 

వాలంటీర్ల పనితీరు ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి, ప్రతినెలా మొదటి రోజునే  నూరుశాతం లబ్దిదారులకు పించన్ల పంపిణీ , వివిధ సంక్షేమ పథకాల అమల్లో వాలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్దిదారుల గుర్తింపు, వివరాల నమోదు తదితర అంశాల ఆధారంగా వాలంటీర్లను అవార్డులకు ఎంపిక చేశారు.  


ఈ నెల 19వ తేది శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని సుమారు 10 రోజులు పాటు సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్ధానిక శాసన సభ్యులు ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాలు కొనసాగుతాయి.  


 

Comments