*రీసర్వే సకాలంలో పూర్తి చేయాలి
*
*: జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 22 (ప్రజా అమరావతి):
జిల్లాలో 54 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్ లు, డిఐఓఎస్లు, తదితరులతో రీ సర్వే, పిఓఎల్ఆర్, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 54 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే ప్రక్రియను టైంలైన్ లోపు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం రీ సర్వేను పూర్తి చేసేందుకు 90 రోజుల సమయం ఇచ్చిందని, నిర్దేశించిన సమయంలోపు రీ సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ తర్వాత వెట్రైజేషన్ త్వరితగతిన చేపట్టాలని, డిఎల్ఆర్ (డ్రాప్ ల్యాండ్ రిజిస్టర్)ను కూడా వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. పిఓఎల్ఆర్ (ఫ్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) ప్రక్రియను ముందుగా పూర్తిచేస్తే ఆయా గ్రామాల్లో రీ సర్వే చేపట్టేందుకు సులభతరం అవుతుందన్నారు. వెనుకబడిన గ్రామాల్లో పిఓఎల్ఆర్ ను పూర్తి చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ కొండయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, తహసీల్దార్ క్రాంతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment