ప్రభుత్వం అందించే పథకాలు వినియోగించుకొని వృద్ధి చెందాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి.ప్రభుత్వం అందించే పథకాలు వినియోగించుకొని వృద్ధి చెందాలి

జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మివిజయనగరం, మే 08 (ప్రజా అమరావతి):

విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం అందించే పథకాలు వినియోగించుకొని వారు స్వశక్తితో జీవించేందుకు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ చెప్పారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన లాప్ టాప్ లు, టచ్ ఫోన్లను కలెక్టర్ సోమవారం స్పందన కార్యక్రమంలో అందజేశారు. జిల్లాలోని పి.జి. విద్యార్హతలు కలిగిన 13 మంది విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి రూ.40,000/- విలువ కలిగిన లాప్ టాప్ లు అందజేశారు. 


 ఇంటర్ విద్యార్హత కలిగిన నలుగురికి రూ.15,000 విలువ కలిగిన టచ్ ఫోన్లను అందజేశారు.  జాయింట్ కలెక్టర్ శ్రీ మయూర్ అశోక్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏ.డి. జగదీష్ తదితరులు పాల్గొన్నారుComments