జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద వచ్చిన పిటిషన్లను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.

 *: జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద వచ్చిన పిటిషన్లను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు  తీసుకోవాలి


బాధ్యతగా పనిచేయండి  రీఓపెన్ కేసులు జీరో శాతం ఉండాలి


*: టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 12 (ప్రజా అమరావతి):


స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనవని, స్పందన గ్రీవెన్స్ రీ ఓపెన్ పిటిషన్ లను, జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద వచ్చిన పిటిషన్ లను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.


శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి స్పందన, రీ ఓపెన్ పిటిషన్లు, గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద వచ్చిన పిటిషన్లు, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్,  ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పే నాయక్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోసెస్, పంచాయతీ రాజ్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డీపీఓ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ ఓపెన్ పిటిషన్ లు 28 ఉన్నాయని, రీ ఓపెన్ పిటిషన్లు రాకుండా నాణ్యతగా పిటిషన్లను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ పిటిషన్ లను సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్ పిటిషన్లను జిల్లా అధికారులు నిత్యం ఓపెన్ చేసి చూసుకోవాలని, అర్జీదారుడితో మాట్లాడాలని, అర్థమయ్యేలా అతనికి వివరించాలని, సమాచారం తెలియజేయాలని, సంతృప్తి కలిగేలా పరిష్కారం చూపించి ఎప్పటికప్పుడు పిటిషన్లను క్లోజ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్, ఆర్డీఓలు పిటిషన్ లకు పరిష్కారం నాణ్యతగా అందించాలన్నారు. మాటలు కాదు చేతల్లో పని చూపించాలని, ప్రాపర్ గా స్పందన పిటిషన్ లను పరిష్కరించాలని ఆదేశించారు. రీ ఓపెన్ పిటిషన్లలో రెవిన్యూకి సంబంధించి ఎక్కువ పిటిషన్ లు ఉంటున్నాయని, ఏ విధమైన ఎండార్స్మెంట్ ఇచ్చారు అనేది పరిశీలించి అర్జీదారుడితో వ్యక్తిగతంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపించి రీఓపెన్ కాకుండా సమస్యను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కి సూచించారు. ఒకసారి రీఓపెన్ పిటిషన్లను పరిష్కరించాక మళ్లీ రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం వ్యవసాయ శాఖకు సంబంధించి 7 పిటిషన్లు, పశుసంవర్ధక శాఖ నుంచి 4, ఎస్పీడిసిఎల్ నుంచి 4, హౌసింగ్ 15, సివిల్ సప్లయిస్ 1, వాలంటిర్ 2, హార్టికల్చర్ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3, పంచాయతీ రాజ్ 10, పోలీస్ 2, రెవెన్యూ 10, ఆర్డబ్ల్యూఎస్ 10, సర్వే 2 పిటిషన్ లు వచ్చాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఎంపీడీవోలు, తహసిల్దార్లు, జిల్లా అధికారులు కార్యాలయానికి రాగానే రీఓపెన్ కేసులు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుని పరిష్కరించాలని, అలాగే జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎన్ని పిటిషన్లు వచ్చాయి అనేది చూసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేగవంతంగా పిటిషన్ల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏరోజు కా రోజు పిటిషన్ల పరిష్కారం చేయకపోతే పెండింగ్ పిటిషన్ల సంఖ్య పెరుగుతుందని, హడావిడిగా కాకుండా జాగ్రత్తగా పిటిషన్లకు పరిష్కారం చూపించాలన్నారు. అర్జీదారుడుతో మాట్లాడి, ఉన్న పరిస్థితిని వివరించి, సంతృప్తి కలిగేలా పరిష్కరించి నిబంధనలు పాటించి పిటిషన్ను క్లోజ్ చేయాలన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రతిరోజు సమయం కేటాయించాలన్నారు.


గడపగడపకు మన ప్రభుత్వంకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 18 పనులు గ్రౌండ్ చేయాల్సి ఉందని, త్వరితగతిన పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీ లలో పనులు ఎలాంటి పెండింగ్ లేకుండా మొదలుపెట్టాలని మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 63 పనులు, అర్దబ్ల్యూఎస్ పరిధిలో గుర్తించిన పనులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలన్నారు. రెవెన్యూ మ్యూటిషన్ లకు సంబంధించి మ్యూటిషన్ ఫర్ కరెక్షన్ లో ఫార్మేట్ నోటీస్ జారీ 3 చోట్ల బియాండ్ ఎస్ఎల్ఏలో ఉందని, వెంటనే తహసీల్దార్ లు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ఉన్న భూ హక్కు పత్రాల పంపిణీని వెంటనే చేపట్టాలన్నారు. రీసర్వే చేపట్టిన గ్రామాల్లో వచ్చే ఆదివారంలోపు స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సర్వే ఏడిని ఆదేశించారు. మనబడి నాడు-నేడుకు సంబంధించి మండల స్థాయిలో జరుగుతున్న పనులకు ఎంపిడివోలు బాధ్యులని, పనులు జరుగుతున్న చోటా ప్రతిరోజు ఒక పాఠశాలను తనిఖీ చేయాలన్నారు. మేజర్ అండ్ మైనర్ మరమ్మతులు, మరుగుదొడ్లు, వంట గదిని పూర్తి చేయాలన్నారు. జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్లను పరిశీలించాలని, స్టాక్ ఎంత వచ్చింది తనిఖీ చేయాలన్నారు. పాఠశాలల పునః ప్రారంభం రోజే జగనన్న విద్యా కానుక కిట్లను ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.



Comments