సిక్కులకోసం ఒక కార్పొరేషన్‌ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.*రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.* 


అమరావతి (ప్రజా అమరావతి);


రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సమావేశమైన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ సింగ్‌ నేతృత్వంలో కలిసిన సిక్కు పెద్దలు.


ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు ఇక్కడ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపిన సిక్కు పెద్దలు.

సిక్కులు, వారికి అనుబంధంగా ఉంటున్న వారికోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరిన సిక్కు పెద్దలు.


సిక్కులకోసం ఒక కార్పొరేషన్‌ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌. 


గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై అంగీకరించిన సీఎం.

గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన సీఎం.

గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు... పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వాలని సీఎం ఆదేశం.

గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు సీఎం అంగీకారం. 

ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించిన సీఎం.

వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని తెలిపిన సీఎం.

వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

వివిధ సామాజిక వర్గాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలన్న సీఎం.

10 రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 


ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

Comments