జూన్ మొదటి వారంలోపు నాడు నేడు పనులు పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

 జూన్ మొదటి వారంలోపు నాడు నేడు పనులు పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

   అమరాపురం, మే 12 (ప్రజా అమరావతి): జూన్ మొదటి వారం లోపు నాడు నేడు పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు అధికారులను  ఆదేశించారు. శుక్రవారం మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం నందు  పలుఅభివృద్ధి పనులను  పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలసి  పరిశీలించారు అమరాపురం నందు. తమ్మేడిపల్లి ప్రాథమిక పాఠశాల నందు నాడు నేడు పనులను పరిశీలించారు.  మధ్యాహ్నం భోజనం పథకం అమలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. డైనింగ్ హాలు  పరిశీలించారు. నాడు నేడు పనులలో నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు.  అంతకు మునుపు  తాసిల్దార్ కార్యాలయం నందు   సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

రెవెన్యూ మ్యూటిషన్ లకు సంబంధించి మ్యూటిషన్ ఫర్ కరెక్షన్ లో ఫార్మేట్ నోటీస్ జారీ  చేయాలిబియాండ్ ఎస్ఎల్ఏలో  జీరో శాతం ఉండాలని తహసీల్దార్ లు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ఉన్న భూ హక్కు పత్రాల పంపిణీని వెంటనే చేపట్టాలన్నారు. రీసర్వే చేపట్టిన గ్రామాల్లో వచ్చే ఆదివారంలోపు స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని  తెలిపారు మనబడి నాడు-నేడుకు సంబంధించి మండల స్థాయిలో జరుగుతున్న పనులకు ఎంపిడివోలు బాధ్యులని, పనులు జరుగుతున్న చోటా ప్రతిరోజు ఒక పాఠశాలను తనిఖీ చేయాలన్నారు. మేజర్ అండ్ మైనర్ మరమ్మతులు, మరుగుదొడ్లు, వంట గదిని పూర్తి చేయాలన్నారు. జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్లను పరిశీలించాలని, స్టాక్ ఎంత వచ్చింది తనిఖీ చేయాలన్నారు. పాఠశాలల పునః ప్రారంభం రోజే జగనన్న విద్యా కానుక కిట్లను ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.పాఠశాలలో ప్రారంభం లోపు నాడు- నేడు పనులు పూర్తి కావాలి

జగనన్న విద్యా కానుక సామాగ్రి నాణ్యత ప్రమాణాల మేరకు ఉండేలా నాణ్యత ప్రమాణాల కమిటీలు తనిఖీ చేయాలి. మండలంలో  గృహ నిర్మాణం పనులు  వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతిరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు  క్షేత్రస్థాయిలో తిరిగి ఇల్లు నిర్మాణాల  పనులలో చురుకైన పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  తాసిల్దార్ కరుణాకర్, ఎంపీడీవో మునస్వామి, గృహ నిర్మాణ అధికారి గణేష్, ఎంఈఓ, ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

  

Comments