ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు " జగనన్నకు చెబుదాం"

 :

నెల్లూరు (ప్రజా అమరావతి);



ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు " జగనన్నకు చెబుదాం" 


లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్న ఘనత ముఖ్యమంత్రి   శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్,  ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.


గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం  మండలం, అనికేపల్లి  గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,   వివిధ పధకాల కింద వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.


ఈ సంధర్బంగా  మంత్రి  శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్న శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో  ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జగనన్నను చెబుదాం కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని, రాష్ట్ర చరిత్రలో ఇలాంటి వినూత్నమైన  కార్యక్రమాలను చేపట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుంద న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరిస్తూ రేపు కావలి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతులకు పట్టాదారుపాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చుక్కల భూముల సమస్య పరిష్కారంతో  రాష్ట్ర వ్యాప్తంగా రైతులు  తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ అనికేపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 12.13 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

 

మంత్రి వెంట   వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments