స్పందన అర్జీదారుల సంతృప్తే ప్రధానమ



మచిలీపట్నం మే 8 (ప్రజా అమరావతి);


స్పందన అర్జీదారుల సంతృప్తే ప్రధానమ


ని వారికి సావధానంగా సమాధానం చెప్పి సంతృప్తి పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సూచించారు


సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శివ నారాయణ రెడ్డి ఆర్డీవో ఐ కిషోర్లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి స్వీకరించారు



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ఎన్నో వ్యయప్రయాసలకు శ్రమకు ఓర్చుకుని జిల్లా కేంద్రానికి వస్తుంటారన్నారు. వారి సమస్యలను సావధానంగా  ఆలకించి ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సాధ్యమైనంతవరకు అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సావధానంగా వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేలా జిల్లా అధికార యంత్రాంగం యావత్తు సిద్ధం కావాలన్నారు. ప్రతి చిన్న సమస్య పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావలసిన అవసరం లేదన్నారు. గ్రామ వార్డు సచివాలయాల నుండి  మండలం, డివిజన్ జిల్లా స్థాయి వరకు

 ఎవరి స్థాయిలో వారు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

సమస్య పరిష్కారం కాకపోతే అది ఎందుకు చేయలేకపోతున్నాము సవివరంగా అర్థమయ్యే విధంగా అర్జీదారునికి సాధారణంగా తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


 ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి: 


👉మచిలీపట్నం మాచవరం గ్రామానికి చెందిన సంగీత రావులక్ష్మి సుభాషిని తాను ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నానని, తాము అద్దె ఇంట్లో ఉంటున్నామని, గత ప్రభుత్వ హయాంలో జి +3 పథకం కింద నివాసానికి 25000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించామని, ఆ ప్రకారం ఇల్లు కాకుండా కరగ్రహారం లేఅవుట్లో సెంటు భూమి కేటాయించారని, తనకు రుణం ద్వారా జి+3 ఇల్లు ఇస్తామని చెప్పిన విధంగా స్థలం పట్టా రద్దుచేసి జి+3 ఇల్లు ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు.


👉మచిలీపట్నం మండలం పెదయాదర గ్రామానికి చెందిన నీలా బాబురావు మార్చి 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు  లబ్ధిదారులందరికీ జమ చేసిన ఆసరా పథకం కింద డబ్బులు తనకు ఇంకా జమ కాలేదని ఆ డబ్బులు జమయ్యెట్లు  చూడాలని అభ్యర్థించారు.


👉 బందరు మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన జొన్నల పార్వతమ్మ తనకు  553. సర్వేనెంబర్ లో 1.33 సెంట్లు, 493 సర్వే నెంబర్లో  0.58 మొత్తం కలిపి 1.9 1 సెంట్ల భూమి ఉందని ఆ భూమిని ఆన్లైన్లో అడంగల్ లో పేరు నమోదు చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.



👉 బందరు మండలం బందరు కోటకు చెందిన తలారి శ్రీనివాసరావు తనకు గుడివాడ మండలం కాశిపూడి గ్రామంలో 25.1 సెంటర్ పొలం ఉందని పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్వో చుట్టూ తిరుగుతున్నానని ఎవరు పట్టించుకోవడంలేదని తనకు పొలమే ఆధారమని, చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.



ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతిబసు, డ్వా మా, డి ఆర్డిఏ పీడీలు జీవీ సూర్యనారాయణ పిఎస్ ఆర్ ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్య, డిపిఓ నాగేశ్వర్ నాయక్, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్ , సిపిఓ వై శ్రీలత, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి విజయభారతి, మూడావిసి రాజలక్ష్మి, డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ ఇందిరా దేవి, డిఇఓ తహేరా సుల్తానా, ఎల్ డి ఎం సాయిరాం, ఐసిడిఎస్ పిడీ సువర్ణ , పంచాయతీ రాజ్  ఎస్ఈ రమణ రావు, రిజిస్ట్రార్ ఉపేంద్ర రావు, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments