జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది.



నెల్లూరు, మే 9 (ప్రజా అమరావతి): ప్రజలు నేరుగా సమస్యలను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్ల డానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంద


ని జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్ అన్నారు.. 


 మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి వర్చువల్ గా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్, ఎస్పీ శ్రీ తిరుమలేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మానాథ్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, అడిషనల్ ఎస్పీ హిమవతి, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు. 

 ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రజా సమస్యలను  పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నదని,క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వార ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటిని భాగస్వామ్యం చేస్తూ ముఖ్యమంత్రి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 1902 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు.  ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక బృందాలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాయన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్వరమే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. 

 ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, డి ఆర్ డి ఎ, డ్వామా, హౌసింగ్ పీడీలు సాంబశివారెడ్డి, వెంకట్రావు, వెంకట దాసు, డీఎంహెచ్వో పెంచలయ్య, డిపిఓ సుస్మిత, జడ్పీ సీఈవో చిరంజీవి, డిఇఓ గంగాభవాని తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


Comments