విద్యా కానుక కిట్ల పంపిణీకి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి.

 విద్యా కానుక కిట్ల పంపిణీకి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి


*


*విద్యాశాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్  అరుణ్ బాబు


  రోద్దం మే 12 (ప్రజా అమరావతి):-


*ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్య కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్   పి అరుణ్ బాబు  విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

 శుక్రవారం రొద్ధం మండలంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న విద్యా కానుక 4 స్టాక్ పాయింట్ కేంద్రాన్ని తనిఖీ చేశారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ విద్యా సంవత్సరానికి సరఫరా చేసిన విద్యార్థుల యూనిఫామ్ దుస్తులను భౌతిక కొలతల ప్రకారం వచ్చాయా లేదా అని పరిశీలించారు. పాఠ్యపుస్తకాలను క్రమ పద్ధతిలో క్లాసులవారిగా విభజించి సరఫరా చేయాలన్నారు. 

జూన్ 1 నుండి 12 తేదీ వరకు మండల స్టాక్ పాయింట్ల నుండి అన్ని పాఠశాలలకు విద్యా కానుక కిట్లను సరఫరా చేయాలన్నారు. ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏపిఎం, నాడు నేడు ఏఈలతో ఏర్పాటు చేసిన మండల టీం ప్రతిరోజు స్టాక్ పాయింట్ ను పరిశీలిస్తూ కిట్లలో ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత సప్లయర్ ను సంప్రదించి రీప్లేస్ చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని, ఆదేశించారు


జగనన్న విద్యా కానుక లో భాగంగా ఇంతవరకు రొద్ధంమండల కేంద్రానికి వచ్చిన స్టాక్ వివరాలను అడిగినారు ఇందులో భాగంగా  రొద్దం మండలానికి 51278 టెక్స్ట్ బుక్స్ కాను మొదటి విడతలో 17,563 బుక్స్ ను సరఫరా చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి తెలిపినారు. 6,7 మరియు 9 వ తరగతి పుస్తకాలు సరఫరా కాలేదు త్వరలోనే సరఫరా చేస్తారని తెలియజేశారు. అదేవిధంగా విద్యా కానుక లో భాగంగా మండల కేంద్రానికి బెల్టు మరియు డిక్షనరీలు సరఫరా చేయడం జరిగింది మొత్తం 3452 బెల్టును మరియు 515 డిక్షనరీలను సరఫరా చేయడం జరిగినది అని తెలిపినారు

ఇంకను రొద్ధం మండలానికి బ్యాగులు నోట్ బుక్స్ యూనిఫార్మ్స్ షూస్ సరఫరా కాలేదు వీటిని త్వరలోనే సరఫరా చేస్తారని తెలియజేశారు

జిల్లా కలెక్టర్ గారు జగనన్న విద్యా కానుక ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి పిల్లవానికి కచ్చితంగా కిట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు మండల అధికారులకు సూచించారు అదేవిధంగా రొద్ధం మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల మరియు ఇంటర్  పెయిల్ అయిన విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన రెమెడియన్ టీచింగ్ ప్రోగ్రాంను పర్యవేక్షించారు. 86 మంది పదవ తరగతి విద్యార్థులు, 76 మంది ఇంటర్మిడియట్ విద్యార్థులు హాజరు అయినారు. విద్యార్థులతో రెమిడీయన్ టీచింగ్ ప్రోగ్రాం గురించి అడిగి విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చినారు. మండల అభివృద్ధి అధికారి రాబర్ట్ విల్సన్ గారు మరియు మండల విద్యాశాఖ అధికారి  ఆంజనేయులు నాయక్ అలాగే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజా గారు, యం.అర్.సి స్టాప్, సి.అర్.పి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ లు పాల్గొన్నారు.


 

Comments