ఉపాధి హామీ పని దినాల లక్ష్య సాధనతో పాటు జాబ్ కార్డుదారులకు కూలీ రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలి


నెల్లూరు (ప్రజా అమరావతి);


ఉపాధి హామీ పని దినాల లక్ష్య సాధనతో పాటు జాబ్ కార్డుదారులకు కూలీ రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్, అధికారులను ఆదేశించారు.


బుధవారం ఉదయం కలిగిరి మండల కేంద్రం పరిధిలోని చిన్న చెరువు లో జరుగుచున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ, ఎన్ని గంటలకు పనులు మొదలు పెట్టారు, ఎప్పటి వరకు కూలీ నగదు జమ అయ్యింది, ప్రస్తుతం వేజ్ రేట్ ఎంత వస్తున్నది అని తెలుసుకోవడంతో పాటు జాబ్ కార్డులను పరిశీలించారు. ప్రస్తుతం వేజ్ రేట్  238 రూపాయలు వస్తున్నదని, గత మాసం ఎప్రిల్ నెలాఖరు వరకు  కూలీ నగదు చెల్లించినట్లు  ఫీల్డ్ అసిస్టెంట్,  జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రావడమైనది. వేజ్ రేట్  పెరిగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మండల పరిధిలో  ఉపాధి హామీ పని దినాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్, డ్వామా అధికారులను ఆదేశించారు.

మండల పరిధిలో లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులను గుర్తించి ప్రతి రోజు ఉపాధి హామీ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


జిల్లా కలెక్టర్ వెంట డ్వామా పిడి  శ్రీ వెంకట్రావు, తహసీల్దార్  రామకృష్ణ, ఎంపిడిఓ కళాధర్ రావు, ఏపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



Comments