ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్.


మచిలీపట్నం మే 20 (ప్రజా అమరావతి);


*ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్**గ్రామాల నుంచి ప్రజలను తీసుకొని బస్సులు ఉదయం 8 గంటలకల్లా సభ స్థలికి చేరుకోవాలని ఆదేశించిన కలెక్టర్*


ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి బందరు పోర్టు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి విచ్చేయనున్న సందర్భంగా వాహనాల పార్కింగ్ ప్రవేశాలను శనివారం రాత్రి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు


జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు ఆవరణలో విఐపి వాహనాల పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.


మాచవరం మెట్టు ప్రాంతంలో బైపాస్ రోడ్డు ప్రాంతంలో బస్సులు వాహనాల పార్కింగ్ కోసం స్థల పరిశీలన గావించారు.


ఉదయం ఎనిమిది గంటలకల్లా సభాస్థలికి బస్సులు చేరుకునేలా ప్లాన్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


కలెక్టర్ తపసిపూడి వద్ద భూమి పూజ  కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో పరిశీలించారు.

Comments