నెల్లూరు (ప్రజా అమరావతి);
మేలైన సాగు పద్ధతులు పాటించి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించి, వారి ఆర్ధిక తోడ్పాటుకు కృషి చేయాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలు, అగ్రికల్చరల్ సీజనల్ కండిషన్స్, ఈ పంట విధానం, వై.ఎస్.ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్, స్పందన- జగనన్నకు చెబుతాం, డా. వై.ఎస్.ఆర్ ఉచిత పంటల భీమా పధకం , వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పధకం అమలు, వ్యవసాయ యాంత్రీకరణ, కిసాన్ డ్రోన్స్ వినియోగం, ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యత తదితర అంశాలపై సమీక్షంచి దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కల్లెకర్ మాట్లాడుతూ, శాస్త్రీయ పద్దతులు పాటించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగిబడి సాధించేలా రైతులను ప్రోత్సహించి రైతుల ఆదాయం వృద్ది చెందేలా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున, జిల్లాలో ఎంత విస్తీర్ణంలో వరి పంట వేస్తున్నారు, అందుకనుగుణంగా అవసరమగు విత్తనాలు, ఎరువులు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు , వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించిన పంటలు గురించి మిగిలిన రైతులకు తెలియచేయడం, వారిని ప్రోత్సహించడం చేసి మరింత మంది రైతులు వ్యవసాయ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం, నాణ్యమైన దిగుబడి పొందడం వంటి అంశాలపై రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందివుచ్చుకునేలా యాంత్రికరణ వైపు రైతులు అడుగులు వేసేలా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కృషిచేయాలన్నారు. రైతులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించి వాటి సాగును ప్రోత్సహించే విధంగా రైతులకు సూచనలు సలహాలు క్షేత్రస్థాయిలో అందివ్వాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి రైతుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర్ రాజు, వ్యవసాయ శాఖ డిడి లు, ఎడి లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment