ఫలితాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యార్థుల హవా.
విజయవాడ (ప్రజా అమరావతి);


*ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2023 ఫలితాల విడుదల*..

*ఫలితాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యార్థుల హవా**ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 86.35% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు*


*కాకినాడ జిల్లాకు చెందిన గోనెల్ల శ్రీ రామ శశాంక్ కు తొలి ర్యాంకు* 


*120 మార్కులకు 120 సాధించిన 15 మందిలో అత్యధికులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యార్థులే*


*అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన విశాఖపట్నం జిల్లా (10,516 మంది విద్యార్థులు)*


*25 మే, 2023న పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పత్రికల్లో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు..*


*29  మే,  2023 నుండి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం* 


*1 జులై, 2023 నుండి పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం*


*ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో అందుబాటులో 77,117 సీట్లు*


*ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు*


*గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అదనంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ డిప్లొమా కోర్సులు*


*2022-23లో 4000 మందికి పైగా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్* 


: *రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు  శ్రీమతి సి.నాగరాణి*


నేడు విడుదలైన “ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్) – 2023” ఫలితాల్లో 86.35 % విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా డైరెక్టర్ శ్రీమతి సి.నాగరాణి వెల్లడించారు. శనివారం విజయవాడ బందర్ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉదయం 10.45 గం.లకు శ్రీమతి నాగరాణి “పాలిసెట్ – 2023” ఫలితాలను విడుదల చేశారు. 


ఈ సందర్భంగా శ్రీమతి నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం 10 మే, 2023 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాలీసెట్ - 2023 ప్రవేశ పరీక్షకు 1,60,332 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 1,43,625 మంది (89.56%) హాజరయ్యారని, అందులో 1,24,021 మంది విద్యార్థులు(86.35%) ఉత్తీర్ణత సాధించారని ఆమె వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 49,388 మంది అమ్మాయిలు(89.90%) కాగా, 74,633 మంది అబ్బాయిలు (84.74%) అని వెల్లడించారు. 120 మార్కులకు గానూ 30 మార్కులు(25%) సాధించిన విద్యార్థులను అర్హులుగా పరిగణించామన్నారు. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకి చెందిన 15 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారని వెల్లడించారు. అత్యధికంగా ఉత్తీర్ణులైన 10,516 మంది విద్యార్థినీ, విద్యార్థులు విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఉత్తీర్ణతకు ఎలాంటి అర్హత మార్కులు లేకపోవడం వల్ల పరీక్షకు హాజరైన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి ఉత్తీర్ణులే అని స్పష్టం చేశారు. పాలిసెట్ పరీక్షలో ఒకే రకమైన మార్కులు పొందిన విద్యార్థుల కు గణితం మార్కులను పరిగణలోకి తీసుకొని ర్యాంకుల వరుస క్రమాలను నిర్ణయించామన్నారు. గణితంలోనూ ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు భౌతిక శాస్త్రం మార్కులను, భౌతిక శాస్త్రంలో కూడా ఒకే రకమైన మార్కులు వస్తే పదో తరగతి మార్కులను, పదో తరగతిలో కూడా ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా ప్రాధాన్యతను నిర్ణయించి ర్యాంకులను ప్రకటించామన్నారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://polycetap.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించి ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. 


25 మే, 2023న వెబ్ కౌన్సెలింగ్ తేదీల వివరాలు తెలుపుతూ పత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 29 మే, 2023 నుండి పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ముందుగా వెబ్ అప్లికేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం అదనంగా ఏర్పాటు చేసిన 4 హెల్ప్ లైన్ సెంటర్లతో కలిపి మొత్తం 39 హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 1 జులై, 2023 నుండి తరగతులు ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు. 


2023-24 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా  గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో అదనంగా చేర్చిన 840 సీట్లతో కలిపి  రాష్ట్రవ్యాప్తంగా 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 17,934 సీట్లు, ఒక ఎయిడెడ్ కాలేజీలో 125 సీట్లు, 177 ప్రైవైట్ కాలేజీల్లో 59,058 సీట్లు మొత్తంగా తొలి ఏడాది పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 77,177 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా కాలేజీల్లో 31 బ్రాంచుల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో కొత్తగా 500 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకాగా లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్, మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పద్ధతుల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు. 2023-24 సంవత్సరానికి గానూ గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ డిప్లొమా కోర్సులు అదనంగా చేర్చామన్నారు.  ఈ ఏడాది 5 కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ లభించిదన్నారు. అదనంగా మరో రెండు కాలేజీలకు అక్రిడిటేషన్ వస్తుందన్నారు. లేబొరెటీస్, కంప్యూటర్ ల్యాబ్స్ ను మరింతగా అభివృద్ధి చేస్తూ మరో 49 పాలిటెక్నిక్ కాలేజీల్లో అక్రిడిటేషన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.. స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం 33 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లలో కరికులమ్ కు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.


2022-23 సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో చివరి సంవత్సరం అభ్యసిస్తున్న 4000 మందికి పైగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యాదీవెన క్రింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ లబ్ధి పొందారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెన క్రింద రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని వెల్లడించారు. అదే విధంగా ఏఐసీటీఈ స్కాలర్ షిప్స్ లో భాగంగా ప్రగతి స్కాలర్ షిప్ క్రింద అమ్మాయిల రూ.50 వేలు, సాక్ష్యం స్కాలర్ షిప్ క్రింద వికలాంగులైన విద్యార్థులు రూ.50వేలు సాయం పొందారన్నారు. 


పాలిసెట్-2023 ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు సెక్రటరీ కే.వి. రమణబాబు, జాయింట్ డైరెక్టర్ వి. పద్మారావు, సంబంధిత శాఖా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image