ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా జవాబుదారీ తనంతో పూర్తి స్థాయిలో పరిష్కరించాలి.రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


.. ఈ రోజు స్పందనలో వచ్చిన అర్జీలు సంఖ్య ..107


ఆన్లైన్ లో 105 , ఆఫ్ లైన్ లో 2, పోలీస్ అర్జీలు 16, పరిపాలన అర్జిలు 91


.. ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా జవాబుదారీ తనంతో పూర్తి స్థాయిలో పరిష్కరించాలి...అర్జీదారుడు సమస్యను జే కే సి 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ ద్వారా  నమోదు చేసుకోవచ్చు.......  కలెక్టర్ కె. మాధవీలత

.... ఎస్పీ సిహెచ్ . సుధీరకుమార్ రెడ్డి  ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో  వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా   పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత ,  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్. సుదీర్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన  కార్యక్రమంలో కలెక్టరు డా. కె . మాధవీలత, జిల్లా ఎస్పీ సిహెచ్ . సుధీర్ కుమార్ రెడ్డి, జేసీ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్ ల తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్  కాకుండా పటిష్టవంతంగా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలన్నారు. ఈ రోజు స్పందనలో ఆన్ ద్వారా 107 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించామన్న రు. ఇందులో ఆన్ లైన్ 105 అర్జీలు, ఆఫ్ లైన్ ద్వారా 2 వచ్చాయని, ఇందులో పోలీసు శాఖ కు సంబందించి 16 అర్జీలు రావడం జరిగిందని  పేర్కొన్నారు.  


ప్రజా సమస్యలు పరిష్కారం  నిమిత్తం స్పందన లో వచ్చిన ప్రతి అర్జీని నిర్నీత కాలంలోనే పరిష్కరించి అర్జీదారునికి న్యాయం చెయ్యాలన్నారు. స్పందన వెబ్ సైట్ లాగిన్ ప్రతిరోజు ఓపెన్ చేస్తూ వచ్చిన అర్జీలను బియోండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా  పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు  మరింత మెరుగైన విధంగా అర్జీల పరిష్కరించేందుకు  జగనన్నకు చెబుదాం   కార్యక్రమమని  ప్రవేశ పెట్టిందన్నారు. స్పందన ద్వారా  అయితే అర్జీలను స్వయంగా  దరఖాస్తు చేసుకుంటారని,  కానీ ఈ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో అర్జీదారుడు సమస్యను 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా  నమోదు చేయవచ్చునన్నారు. ప్రజల యొక్క  ప్రతి అర్జీని  నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.


 ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలోని అన్ని కార్యాలయాల్లో ప్రాజెక్టు మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.


జిల్లా సూపరంటెండెంట్ ఆఫ్ పోలీసు సి.హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖకు సంబందించి స్పందనలో  16 అర్జీలను స్వీకరించామన్నారు.  అర్జీదారుల సమస్యలను త్వరితగతిన నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. 


స్పందన లో కొన్ని అర్జీలు...


రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట్ నివాసి చిర్రా సత్యవతి వారి అర్జీలో తన కుమార్తె గంగాభావాని సంవత్సరం క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లినదని, అయితే అక్కడ మా అమ్మాయికి జీతం ఇవ్వడంలేదని, అన్నంకూడా పెట్టడం లేదు. కావున మా అమ్మాయిని ఇండియాకు రప్పించవలసిందిగా అర్జీ లో కోరారు.


చాగల్లు మండలం మీనానగరం గ్రామ నివాసికొక్కిరపాటి గంగరత్నం వారి అర్జీలో   గెడ్డం రమేష్ అను వారు తన 3 వ కుమాటుడును కొట్టి పోలీస్ కేస్ పెట్టారు. కావున న్యాయం చేసి వారి నుండి రక్షణ కల్పించాలని అర్జీలో కోరారు.


రంగంపేట మండలం రంగం పేట గ్రామానికి చెందిన తూము వీర్రాజు తమ అర్జీలో గ్రామంలో ఉన్న రైస్ మిల్లు కు సంబందించి విద్యుత్ సర్వీసు గతంలో ఎల్.టి. నుంచి హెచ్ వీ.కి మార్చారు. కావున సర్వీసు మీటరు మార్చి సమస్యను పరిష్కరించాలని వారు తమ అర్జీలో పేర్కొన్నారు. 


కడియం మండలం మురముల్ల గ్రామానికి చెందిన రోక్కల పాప తమ అర్జీలో తన రెండవ కుమారుడు అతని భార్య కలసి ఇల్లు కొరకు తనను వేధిస్తున్నారని,  తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని ఆర్జీలో కోరారు. 


రంగంపేట మండలం కొత్తపల్లి గ్రామ నివాసి వారి అర్జీలో తన పేరున మంజూరైన గృహనిర్మాణం లోన్  అధికారులు అకౌంట్ నెంబరు తప్పుగా నమోదు చేయడం వలన వేరే వారి అకౌంట్ కు జమ అయ్యింది. కావున నాకు మంజూరు అయిన లోన్ ఇప్పించవలసిందిగా వారను ఆర్జీలో కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే. దినేష్ కుమార్, అడిషినల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, డీఆర్వో  జి.  నరశింహులు,ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, పర్యాటక శాఖ రీజనల్ ఎగ్జిక్యూటివ్ సంచాలకులు వి.స్వామినాయుడు,  డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి,  సీపీఓ కె.ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డిపిఓ పి. జగదాంబ, గిరిజన సంక్షేమ అధికారి కే. ఎస్.జ్యోతి , డి ఎల్ డిఓ  పి. వీణాదేవి, డీఎస్ఓ పి. ప్రసాదరావు, సివిల్ సప్లై జిల్లామేనేజరు నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకర రావు, డి ఎల్ డివో వి. శాంత మణి, డిఆర్డీఏ పిడి ఎస్. సుభాషిణి,   పలువురు జిల్లా శాఖా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


Comments