జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాం.

 *జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాం*


*: వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డికి వివరించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 11 (ప్రజా అమరావతి):


జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వివరించారు. గురువారం అమరావతి నుండి.. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, హెల్త్ / ఐసిడిఎస్ పరిధిలో ప్రభుత్వ పథకాలు మరియు ఎస్డిజి ఇండికేటర్స్, స్కూల్ ఎడ్యుకేషన్, గ్రామ/వార్డు సచివాలయాలు, స్పందన గ్రీవెన్స్, గడప గడపకు మన ప్రభుత్వం, తదితర అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.జవహర్ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.


పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు,  జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు జిల్లాకు వచ్చి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు. అధికారులకు పిటీషన్ లను ఎలా పరిష్కరించాలి, ఇతర అంశాలపై పలు ఆదేశాలు జారీచేశారన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద పిటిషన్ లను ప్రతిరోజు ఓపెన్ చేసి చూడడం జరుగుతుందని, పిటిషన్లను పరిష్కరించాలని కిందిస్థాయి అధికారులకు ఫోన్ల ద్వారా చెబుతున్నామన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టీం లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన పిటీషన్ ల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వారంలో నాలుగు రోజులు జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, ప్రతి పిటిషన్ వారిగా డిస్కషన్ చేసి పిటిషన్ ని ఎలా పరిష్కరించారు, ఎలా ఎండార్స్ చేస్తున్నారనేది పరిశీలిస్తున్నామన్నారు. 1902 టోల్ ఫ్రీ నెంబర్ కి సంబంధించి విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్ పోస్టర్లను ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పిటిషన్లకు గడువులోగా పరిష్కారం చూపిస్తున్నామని, రీఓపెన్ గ్రీవెన్స్ లు కూడా తగ్గుతున్నాయన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయ్ కుమార్, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, డిఈఓ మీనాక్షి,  సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, బీసీ వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతి, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments