నెల్లూరు: మే 2 (ప్రజా అమరావతి); ఉపాధి హామీ పనుల్లో జిల్లాను ముందంజలో నిలపడానికి డ్వామా అధికారులు కృషి చేయాల
ని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ కోరారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరును కలెక్టర్ డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రావు, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల , ఏపీడీలతో కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షలో కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా మంచి ఫలితాలు సాధించడానికి అందరూ సమిష్టిగా పనిచేసి లక్ష్యాలు సాధించాలన్నారు .ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విదంగా చర్యలు తీసుకోవాలని, పని దినాలు పెరగడంతో పాటు సరాసరి దినసరి వేతనం పెరగాలన్నారు. క్రింది స్థాయిలో సిబ్బంది పనిచేస్తున్నారో లేదో పర్యవేక్షణ చేయాలని సూచించారు ఉపాధి హామీ పనులలోఇరిగేషన్ కు సంబదించి ఫీల్డ్ చానల్స్ లకు, మోయిజర్ కన్జర్వేషన్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు . ఉద్యానవనమొక్కలు, పండ్ల మొక్కలు వేయాలని , నాటిన మొక్కలన్నీ బ్రతికే విధంగా చూడాలన్నారు .15 రోజులకు ఒకసారి సమీక్ష చేస్తామని పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని అధికారులకు తెలిపారు.
addComments
Post a Comment