స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలి.మచిలీపట్నం మే 15 (ప్రజా అమరావతి);


ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాల


ని సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాధిజిత సింగ్ అధికారులను ఆదేశించారు.


సోమవారం ఉదయం సంయుక్త కలెక్టర్ డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శివ నారాయణ రెడ్డిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి  సమస్యలను పరిష్కరించాలని సూచించారు.


ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నిస్తోందన్నారు. ఈ విషయమై  రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  స్పందన అర్జీల పరిష్కారం పై తరచూ సమీక్షిస్తున్నారన్నారు.  జిల్లా స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు అధికారులు వారికి సంబంధించిన స్పందన అర్జీలను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.


స్పందన అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదని స్పష్టం చేశారు. 


 ఈ సందర్భంగా అందిన కొన్ని అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి :


👉భారత విద్యార్థి ఫెడరేషన్ కృష్ణాజిల్లా కమిటీ ప్రతినిధులు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో కొన్ని డిగ్రీ కళాశాలలు వేసవి సెలవులు అమలు చేయక పోవడంతో ఎండ తీవ్రత కు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వేసవి సెలవులు అమలు చేయాలని  కోరుతూ వినతిపత్రం అందజేశారు.


👉మచిలీపట్నం నగరపాలక సంస్థ 31 వ డివిజన్ శివగంగ కాపురస్తులు కోలా విజయలక్ష్మి తన రేకుల షెడ్డు ఇంటికి కుళాయి లేకున్నా కుళాయి పన్ను డిమాండ్ వేశారని దానిని రద్దు చేయాలని మున్సిపల్ శాఖను కోరినప్పటికీ రద్దు చేయలేదని ఆ కుళాయి పన్ను రద్దు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.


👉104 ఎం ఎం యు ఉద్యోగ సంఘం కృష్ణా జిల్లా కమిటీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నేరుగా కాంట్రాక్టు ఆఫర్స్ లో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.


👉మండల కేంద్రమైన మొవ్వ విద్యానగర్ కాలనీకి చెందిన సాంబయ్య యద్దనపూడి గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ భూముల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర్లు ట్రాక్టర్లతో మట్టి తరలించడంతో సీజ్ చేసినప్పటికీ మరలా త్రవ్వకాలు క్రయ విక్రయాలు చేస్తూ స్థానికులను, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనిపై  విచారణ జర్పి తగిన చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదు చేశారు.


ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ డ్వామా ఐసిడిఎస్ పిడిలు పిఎస్ఆర్ ప్రసాద్, జి వి సూర్యనారాయణ స్వర్ణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సరస్వతి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, సిపిఓ వై శ్రీలత, ముడావిసి రాజ్యలక్ష్మి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.Comments