ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్నీ రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలి.


నెల్లూరు (ప్రజా అమరావతి);


ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్నీ రంగాల్లో మొదటి స్థానంలో  నిలిపేందుకు కృషిచేయాల


ని  రాష్ట్ర  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన  జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్,  శాసన మండలిసభ్యులు శ్రీ మేరుగ మురళీధర్, శ్రీ పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, గూడూరు శాసన సభ్యులు శ్రీ వర  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.   జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ,  గౌరవ జడ్పిటిసిసభ్యులు, ఎంపిపిలు, మండల స్థాయి అధికారులను సమన్వయ పర్చుకొని  ప్రభుత్వ సంక్షేమ పధకాలను నిరుపేద బడుగు బలహీన వర్గాలకు  చేరేలా కృషి చేస్తూ జిల్లాను  ప్రగతి బాటలో ముందజలో నిలిపేందుకు  సహాయ సహకారాలు అందించవలసిందిగా  కోరారు.   జగనన్న కాలనీల్లో పేదలకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల  పురోగతిలో జిల్లా మొదటి స్థానంలో వుండటం అభినందనీయమన్నారు. 


ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ,  జిల్లా గృహ నిర్మాణ సంస్థ, జలవనరుల శాఖ మరి వాటి అనుబంధ శాఖలు, రహదారులు మరియు భవనాల శాఖ, విద్యుత్ శాఖ, జిల్లా వ్యవసాయం శాఖ తదితర శాఖలకు సంబంధించిన అజెండా అంశాలపై    శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జడ్పిటిసి, ఎంపిపి సభ్యులు  అనేక సమస్యలను  ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా  జిల్లా వ్యాప్తంగా  ముఖ్యంగా మెట్ట ప్రాంత మండలాల్లో  త్రాగు నీటి సమస్య వుందని, జల జీవన్ మిషన్ పధకం క్రింద చేపట్టిన  మంచినీటి పధకాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరడం జరిగింది.  అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పేద వాని సొంటింటి కల నెరవేర్చే లక్ష్యంతో  అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని,   మంజూరైన ఇల్లు త్వరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు మంత్రి దృష్టికి తీసుకరావడం జరిగింది. 


మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గత సమావేశం వరకు  మనతో వుండి  అనేక రకాలుగా సమాజానికి సేవ చేస్తూ  రాపూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా వున్న  శ్రీ చెన్ను బాలకృష్ణా రెడ్డి గారు  ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని,  మండల పరిషత్ అధ్యక్షులుగా   ఆయన ఆ ప్రాంత అభివృద్దికి   ఎనలేని  కృషిచేసినటు వంటి వ్యక్తి, అనేక సంధార్భాల్లో  పేదల పక్షాన నిలబడి పేదలకు అండగా   అనేక రకాలుగా తోద్పుటు అందించిన వ్యక్తి  అకాల మరణం కారణంగా  మనల్ని వదలి వెళ్లిపొడవడం జరిగిందని,ఆయన మృతి  బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి అన్నారు. రాష్ట్ర చరిత్రలో  ప్రతి పేద వాణి సొంటింటి కల నెరవేర్చెలా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి   ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు.  జిల్లాలోని అన్నీ మండలాలను నుడా పరిధిలోని చేరుస్తూ అర్హులైనా ప్రతి ఒక్కరికి  ఇల్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో వున్న  చుక్కల భూముల సమస్యను పరిష్కరిస్తూ,  ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు  చుక్కల భూముల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు  పట్టాదారు పాసు పుస్తకాలను  జారీచేయడం పట్ల జిల్లాలోని రైతుల పక్షాన,  ఈ సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధుల పక్షాన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి హృధపూర్వక దాన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి శ్రీ  గోవర్ధన్ రెడ్డి  తెలిపారు.  జిల్లాలోని రైతాంగానికి రెండో పంటకు సాగునీరు ఇవ్వడం జరుగుచున్నదని, పాలకులు మంచి వారైతే ప్రకృతి సహకరిస్తుందన్న సామెతగా వరుసగా 4 సంవత్సరాలుగా రెండో పంటకు నీరు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.  గతంలో మొదటి పంటకే నీరు ఇవ్వలేని పరిస్థితి  ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదని  మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖకు సంబంధించి యాంత్రీకరణలో బాగంగా కొన్ని గ్రూపులకు వరి కోత యంత్రాలను,  మరికొన్ని గ్రూపులకు     ట్రాక్టర్లను మంజూరు జరిగిందని,  మిగిలిన పోయిన గ్రూపులు కూడా  వారి సచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు  చేసుకున్నటైతే  వ్యవసాయ యాంత్రీకరణ కింద అర్హులైన ప్రతి రైతుకు  పవర్ స్ప్రెయర్స్,  డ్రోన్స్, టార్బాలిన్ పట్టలు తదితర వ్యవసాయ పనిముట్లను వచ్చే సీజన్లో ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.   రైతు భరోసా,   పి ఏం కిసాన్ కింద  ఈ నెలాఖరు లేదా  జూన్  మొదటి మాసంలో  రైతులకు నగదును వారి ఖాతాల్లో జమచేయడం జరుగుతుందని, అయితే పి.ఎం కిసాన్ కింద తప్పని సరిగా ఈకెవైసి చేసుకోవాల్సి వుంటుందని మంత్రి స్పష్టం చేశారు.  సిఎం యాప్  ద్వారా  ఏ పంటకు గిట్టు బాటు ధర లేదు అంటే  వెంటనే  ప్రభుత్వం  జోక్యం చేసుకొని  కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలను కూడా  ప్రభుత్వమే కొనుగోలు చేయడం  జరుగు చున్నదన్నారు.  జిల్లా లో ఎక్కడైతే మొక్కజొన్న పంట కొనుగోలు చేయాల్సి వుందో అక్కడ  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మొక్క జొన్న పంటను కొనుగోలు చేయాల్సిందిగా మార్క్ఫెడ్ వారిని ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు.   ప్రోటోకాల్ విషయంలో  అధికారులు ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా  అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై వుందని స్పష్టం చేయడం జరిగిందని మంత్రీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో గౌరవ సభ్యులు ప్రస్తావించిన సమస్యలను  పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని,  జిల్లాలో  జల జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన మంచి నీటి పధకాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు  తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  అందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు, ఇళ్ల నిర్మాణాల పురోగతిలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని  కలెక్టర్ తెలిపారు. 


 వివిద ప్రభుత్వ ప్రాధాన్యతా భవనా నిర్మాణాల పనులు  జిల్లాలో ముమ్మరంగా జరుగుచున్నవని, ఈ నిర్మాణ పనులకు ఇసుకను  లబ్ధిదారులు ఉదారంగా తోలుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, ఆలాగే వాకాడు వద్ద నిర్మించిన స్వర్ణముఖి బ్యారేజి కి  ఇప్పటి వరకు నీటి కెటాయింపు జరగలేదని,  ఈ బ్యారేజికి వాటర్  కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మండలాల్లో జరుగు మండల సర్వ సభ్య సమావేశాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించి అధికారులు ప్రోటోకాల్ సక్రమంగా అమలు చేయడం లేదని  గూడూరు శాసన సభ్యులు శ్రీ వర ప్రసాద్,  మంత్రి దృష్టికి తీసుకు రావడం జరిగింది. 


శాసన మండలి సభ్యులు శ్రీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ,  రాపూరు మండలంలో నీటి ఎద్దడి ఎక్కువగా వుంటుందని,   వర్షా కాలంలో ఆ ప్రాంతానికి సంబంధించిన కొండ వాగు  ద్వారా సుమారు రెండు, మూడు నెలల పాటు నిరంతరం  వర్షం నీరు పారుతుందని,  కొండవాగు నుండి రాపూరు మండల పరిధిలోని చెరువులకు లింక్ కెనాల్స్ ద్వారా  వర్షపు నీటితో నింపుకున్నాటైతే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని   మంత్రి దృష్టికి తీసుకు రాగా, మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ,  సంబంధిత సమస్యకు ప్రతిపాదనలు తయారు చేయాలని  జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 


దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు  విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మనబడి నాడు నేడు కార్యక్రమం కింద అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుచున్నదని, ప్రభుత్వ ప్రాశాలల్లో చదువుచూ 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను ప్రోత్సహించాల్సిన అవసరం వుందని   ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని  శాసన మండలి సభ్యులు శ్రీ పర్వతరెడ్డి  చంద్ర శేఖర్ రెడ్డి  తెల్పగా,  మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు స్పందిస్తూ రాష్ట్రంలోని   అన్నీ  నియోజక వర్గాల పరిధిలో  జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ  మంచి ప్రతిభతో ఉత్తీర్ణత   సాధించిన విధ్యార్ధులను సన్మానించుకోవడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. 


అనంతరం శాసన మండలి సభ్యులుగా నూతనంగా ఇటీవల  ఎన్నికైన  శ్రీ మేరుగ మురళీధర్  ను, శ్రీ పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి లను మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ శాలువతో సన్మానించడం జరిగింది. 


తొలుత సమావేశానికి ముందు  రాపూరు ఎంపిపి సభ్యులు శ్రీ చెన్ను బాలకృష్ణా రెడ్డి గారి  అకాల  మరణం  సంధర్భంగా  వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. 


ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, తిరుపతి జిల్లా ఇంచార్జీ జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీ చిరంజీవి,  ఆప్కాప్ ఛైర్మన్ శ్రీ అనీల్ బాబు, విజయ డైరీ ఛైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆర్.డబ్ల్యూ. ఎస్., విద్యుత్, జలవనరుల శాఖ, సోమశిల ప్రాజెక్టు, రోడ్లు, భవనాల శాఖ ఎస్.ఈ లు శ్రీ రంగా వర ప్రసాద్,  శ్రీ వెంకట సుబ్బయ్య, శ్రీ కృష్ణమోహన్, శ్రీ వెంకట రమణారెడ్డి,  శ్రీ గంగాధర్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర్ రాజు,  వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments