చిత్త శుద్ధితో సచివాలయ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలి..
జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
గూనివారి పల్లి, మే 6 (ప్రజా అమరావతి):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ కూడా చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర పి అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం బుక్కపట్నం మండలంలోని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గూనువరిపల్లి పంచాయతీ నందు గ్రామ సచివాలయాన్నిఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామసచివాలయ సిబ్బందితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూసచివాలయ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సచివాలయ ఉద్యోగులే ముఖ్యమైన పాత్రను వహించాలని తెలిపారు. తదుపరి సచివాలయ కార్యాలయంలో గల అన్ని రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలన్నీ కూడా వెనువెంటనే అప్లోడ్ చేయాలని వారు సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, కఠిన చర్యలు కూడా తప్పవని సూచించారు. ప్రజలలో మమేకమై సమస్యలను విని పరిష్కరించినప్పుడే సచివాలయ వ్యవస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. త్వరితగతిన నూతన బిల్డింగ్ కి మారాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామ సచివాలయ బోర్డును ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు.
బుచ్చయ్య గారి పల్లి జగనన్న హౌసింగ్ కాలనీ నందు సోమవారం లోపు విద్యుత్తు లైట్లు అమర్చాలి జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీ నందు మౌలిక వసతులపై
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హౌసింగ్ లబ్ధిదారులతో ముచ్చటించారు
ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని హౌసింగ్ సిబ్బందిని ఆదేశించారు పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. ఇల్లు నిర్మాణం పనులు ఇంజనీర్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్అసిస్టెంట్లను ఆదేశించారు.
స్కూల్ తెరిచే నాటికి జగన్ అన్న విద్యా కానుక మెటీరియర్ల సిద్ధం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్
బుక్కపట్నం మండలంలోని ఎంఈఓ ఆఫీస్ నందు జగనన్న విద్యా కానుక కిట్ మెటీరియర్లను పరిశీలించారు. నాణ్యమైన JVK మెటీరియర్లను విద్యార్థులకు అందజేయాలని అందుకు కార్యచరణప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.3,4,5,10, తరగతి విద్యార్థులకు సంబంధించిన నోట్ బుక్స్ మరియు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన తరగతులకు సంబంధించిన నోట్ బుక్స్ మరియు పుస్తకాలు మూడో వారంలో రానున్నాయని జిల్లా కలెక్టర్కు అధికారులు వివరించారు. బూట్లు , రెండు జతల సాక్స్, బెల్టును, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుమునుపు జిల్లా విద్యా శిక్షణ సంస్థ లో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు, అక్కడ జిల్లా పేరు అనంతపురం ఇంకా ఉన్నదని దానిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, ఎంపీడీవో శ్రీనివాసులు, గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీ గోపాల్ రెడ్డి, విద్యుత్ ఏఈ నారాయణ స్వామి నాయక్, ఎంఈఓ గోపాల్ నాయక్, హైమావతి, దామోదర్ రెడ్డి, గూని వారి పల్లి సర్పంచ్ విజయ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment