గడప గడపకు పనుల ప్రతిపాదనలు సమర్పించాలి.



*గడప గడపకు పనుల ప్రతిపాదనలు సమర్పించాలి


*


పార్వతీపురం, మే 12 (ప్రజా అమరావతి): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన పనుల ప్రతిపాదనలు తక్షణం సమర్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ఉపాధి హామీ పథకంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బందితో శుక్ర వారం జిల్లా కలెక్టర్ అవగాహన మరియు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రూ.124 కోట్ల విలువ గల పనులు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. జిల్లాకు ఇది మంచి అవకాశమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు మౌళిక సదుపాయాల కల్పన అవసరం ఉందని, ఈ కార్యక్రమాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం పరిధిలో రూ.40 లక్షల విలువ వరకు పనులు చేసుకునే అవకాశం ప్రభుత్వం జిల్లాకు కల్పించిందని ఆయన వివరించారు. పనులు గుర్తించకపోతే ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపడుతున్న పనులకు బిల్లులు వెంటనే మంజూరు అవుతాయని ఆయన అన్నారు. బిల్లులు వెంటనే అప్ లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. 83 సచివాలయాల పరిధిలో రూ.40 లక్షల విలువ గల పనులు చేయుటకు పనులు మంజూరు చేశామని ఆయన చెప్పారు. సచివాలయం పరిధిలో తిరిగి పనులు గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సంప్రదించి పనులు పక్కాగా ప్రతిపాదించాలని ఆయన అన్నారు. పనులు అవసరం లేకపోతే, సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత సమయంలో ప్రతిపాదనలు సమర్పించకపోతే, పనులు మంజూరు జరగదని, భవిష్యత్తులో పనులు మంజూరు జరగదని ఆయన స్పష్టం చేశారు. పనులు మంజూరు చేసిన 72 గంటలలో ప్రారంభం కావాలని ఆయన ఆదేశించారు. పనులకు సంబంధించిన అగ్రిమెంట్, నామినేషన్ తదితర అంశాలు ఐదు రోజుల్లో మండల స్థాయి బృందం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే పది రోజులు గడప గడపకు మన ప్రభుత్వం పనులు, ఉపాధి హామీ పనులు లక్ష్యంగా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇంజినీర్లు వృత్తి నిబద్దతతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పనులు వేగవంతంగా పూర్తి చేయుటకు సంబంధిత కాంట్రాక్టర్లను, సిబ్బందిని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. మంజూరు చేసిన పనులు పూర్తి అయిన వెంటనే కొత్త పనులు ప్రతిపాదించాలని ఆయన అన్నారు. బిల్లులు అప్ లోడ్ చేయుటకు 24*7 వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం రెవిన్యూ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం పనులను పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, పాలకొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం పనులకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని ఆయన స్పష్టం చేశారు. 


ఈ అవగాహన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మరియు పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణా జి, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, మునిసిపల్ కమీషనర్లు జె. రామ అప్పల నాయుడు, హెచ్. శంకర రావు, ఎస్. సర్వేశ్వర రావు, జిల్లా ప్రజా ఆరోగ్య శాఖ అధికారి కె.జి.ఎన్.నరసింగ రావు, డిఇలు, ఎం.పి.డి.ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Comments