రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొత్త పథకాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు,

 రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొత్త పథకాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు,


జగరాజుపల్లి,మే10 (ప్రజా అమరావతి):రాష్ట్రప్రభుత్వం చేపడుతున్నకొత్తపథకాలగురించిప్రజలకుఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాలిఅనిజిల్లాప్రత్యేకఅధికారికివీఎన్.చక్రధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి నందు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని, హౌసింగ్ లేఅవుట్, నాడు నేడు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు, గ్రామ సచివాలయం నందు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్  టీఎ

స్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, జగరాజుపల్లి సర్పంచ్ లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారంఇవ్వాలి.అధికారులంతాసమష్టిగాపనిచేయాలితెలిపారు. అర్హులైన ప్రతి  లబ్ధిదారుడుకు వివిధ సంక్షేమ పథకాలు అమలయ్యే  విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నాణ్యమైన సేవలు ప్రజలు అందించవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రజల నుంచి    అర్జీలనుస్వీకరించే కార్యక్రమం  చేపట్టాలని తెలిపారు.

అన్ని గ్రామాలకు ఒకే రకమైన పనులు అవసరం ఉండదు ఒక్కో గ్రామానికి అవసరాలు వేరువేరుగా ఉంటాయి అటువంటిఅవసరాలనుగుర్తించి. గుర్తించినఅవసరాలకుఅనుగుణంగాప్రణాళికలరూపొందించుకోవాలి. ఈ ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో అందుబాటులో ఉన్న వనరులతో పారదర్శకతతో తయారు చేయాలి. అందుకు ప్రజాప్రతి నిధులసహకారం తీసుకొని గ్రామాలను అభివృద్ధి  చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని పేర్కొన్నారు. గ్రామ సమస్యలు గ్రామంలోని పరిష్కారం కావాలి. సచివాల ఉద్యోగస్తులు బాధ్యతగా పనిచేయండి, సేవలో  జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలిపారు. సచివాలయాల్లో  సుమారు 200 సేవలు ప్రజలకు అందించవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నను చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు, ఐఏఎస్ జిల్లాకు రావడం జరిగిందని, స్పందన పై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. ఆయా శాఖల వారీగా గ్రీవెన్స్ ఎలా పరిష్కరిస్తున్నాము, భవిష్యత్తులో గ్రీవెన్స్ కు ఎలా పరిష్కారం చూపించాలి, సిఎంఓ కార్యాలయం నుంచి ఏం ఆశిస్తున్నారో ఆయన తెలియజేశారన్నారు.  ప్రత్యేక అధికారి రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు, రైతులకు అందజేస్తున్న ఉచిత సేవలపై ఆరా తీశారు, నాడు నేడు పనులు ఇంటర్మీడియట్   అదనపుతరగతుల  భవన నిర్మాణాలను పరిశీలించారు, జగనన్న హౌసింగ్ లేవట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం పుట్టపర్తి లోని  ఏనుములపల్లి నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.

 ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డి మండే హెచ్ ఓ ఎస్ వి కృష్ణారెడ్డి, డిపిఓ విజయ్ కుమార్, గ్రామ సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి,  అధికారులు  తదితరులు పాల్గొన్నారు


 

Comments