ట్రయల్ మేనిఫెస్టోకే ఇలా అయిపోతున్నారు.. అసలు మేనిఫెస్టో వస్తే అయిపులేకుండా పోతారేమో!

అమరావతి (ప్రజా అమరావతి);


 *అధికారంలోకి రాకముందు జగన్ ఇచ్చిన హామీలెన్ని, 4ఏళ్లలో నెరవేర్చినవి ఎన్నో ప్రజలకు చెబుతూ, వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి, మంత్రులకు ఉందా?* *98.8శాతం హామీలు అమలుచేసినట్టు సిగ్గుఎగ్గులేకుండా అబద్ధాలుచెప్పడం జగన్ అతని మంత్రులకే చెల్లింది.* 

 

 

•  టీడీపీమహానాడులో చంద్రబాబుప్రకటించిన మేనిఫెస్టోపై వైసీపీనేతలు, మంత్రులు ఎందుకంతలా కడుపుమంటతో కిందామీదపడుతున్నారు? 

• ట్రయల్ మేనిఫెస్టోకే ఇలా అయిపోతున్నారు.. అసలు మేనిఫెస్టో వస్తే అయిపులేకుండా పోతారేమో!


•  4ఏళ్లపాలనలో  జగన్ బీసీలకు ఏంఒరగబెట్టాడో వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? 

• 17మంది బీసీలకు మంత్రిపదవులిచ్చిన జగన్, వారిపై పెతనాన్ని సజ్జల, విజయసాయి, వై.వీ.సుబ్బారెడ్డికి అప్పగించాడని జోగిరమేశ్ కు తెలియదా?

• ఇరిగేషన్ మంత్రిగా  ఒక్కఎకరాకు కొత్తగా నీరివ్వని అంబటి, జగన్ అవినీతిని కప్పిపుచ్చుతూ మాట్లాడటం సిగ్గుచేటు. 

• అకాలవర్షాలతో నష్టపోయిన రైతులవద్దకు వెళ్లి వారితో మాట్లాడలేని కాకాణి టీడీపీ మేనిఫెస్టోపై, చంద్రబాబుపై విమర్శలుచేయడం  హాస్యాస్పదంగా ఉంది.

• 45ఏళ్లు నిండిన మహిళలకు 3వేలపింఛన్, అవ్వాతాతలకు రూ.3వేలు, మద్యపాననిషేధం, రైతులకు సబ్సిడీపై యాంత్రీకరణ, డ్రిప్ పరికరాలు, ట్రాక్టర్లిస్తానన్న హామీలు ఏమయ్యాయి?

• అమ్మఒడి అత్తెసరు అమలుకే ఎందుకు పరిమితమైంది? 

• నాడు-నేడు ఎందుకు అవినీతిమయమైంది? రైతుభరోసా కేంద్రాలు ఎందుకు రంగులకేంద్రాలుగా మారాయి?  


*శ్రీ  ఆలపాటి రాజేంద్రప్రసాద్  (మాజీమంత్రి)*


“మంత్రులు, మాజీమంత్రులు, వైసీపీనేతలంతా పనిగట్టుకొనిమరీ టీడీపీ మహనాడులో ప్రకటించిన మేనిఫెస్టోపై విమర్శలుచేయడం, వారిలోని భయానికి, అభద్రతా భావానికి నిదర్శనమని, భవిష్యత్ పై రాష్ట్రప్రజలకు భరోసాఇస్తూ చంద్ర బాబుగారు మాట్లాడితే, ఎందుకు కడుపుమంటతో కిందామీదా పడుతున్నారో, ఎందుకు ఓర్వలేకపోతున్నారో జగన్ అండ్ కో సమాధానంచెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలెన్ని, అధికారంలోకి వచ్చాక నెరవేర్చినవి ఎన్నో మంత్రులు ప్రజలకు చెప్పాలి.* *45ఏళ్లు నిండిన మహిళలకు 3వేలపింఛన్, అవ్వాతాతలకు రూ.3వేలు, మద్యపాననిషేధం, రైతులకు సబ్సిడీపై యాంత్రీకరణ, డ్రిప్ పరికరాలు, ట్రాక్టర్లిస్తానన్న హామీలు ఏమయ్యాయి?*

“జగన్మోహన్ రెడ్డి గతఎన్నికలకు ముందు ఇచ్చినహామీలు, వాటిని అమలు చేయలేని వైసీపీప్రభుత్వ అసమర్థతపై ఇప్పుడు మాట్లాడుతున్నవాళ్లంతా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నా. 45ఏళ్లునిండిన మహిళలకు రూ.3వేల  పింఛన్ ఇస్తానన్న జగన్ హామీఎక్కడుంది? జగన్ హామీప్రకారం 4ఏళ్లలో ఒక్కోమహిళకు రూ.1,44,000లు రావాల్సిఉంటే, కేవలం రూ.36వేలు ఇచ్చి చేతులుదులుపుకున్నారు.  అవ్వాతాతలకు ఇస్తానన్న రూ.3వేల పింఛన్ సంగతిఏమైందో మంత్రులు చెప్పాలి.   జగన్ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మద్య పాననిషేధం హామీఏమైంది? 98.8శాతంహామీలను జగన్ నెరవేర్చాడని సిగ్గు,ఎగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రవ్యవసాయరంగాన్ని, అవినీ తితో అతలాకుతలం చేసిన జగన్ చేతగానితనాన్నికప్పిపుచ్చుతూ, ఇరిగేషన్ మంత్రిగా  ఒక్కఎకరాకు కొత్తగానీరివ్వడం చేతగానిఅంబటిరాంబాబు మాట్లాడటం నోటికిపనిచెప్పడం తప్పమరోటికాదు. నోరుందని ఏదిపడితే అది మాట్లాడితే అవన్నీ నిజాలుకావని అంబటి గ్రహించాలి. పోలవరంప్రాజెక్ట్ ని పూర్తిచేసి 2020నాటికి జాతికి అంకితం చేస్తానన్న జగన్ రెడ్డి హామీ ఏమైందో అంబటి సమాధానంచెప్పాలి. రివర్స్ టెండరింగ్ ద్వారా అంబటి, జగన్మో హన్ రెడ్డి ఏంసాధించారో ప్రజలకు సమాధానంచెప్పాలి. పులిచింతల డ్యామ్ గేటుఊడిపోతే, అదిబిగించలేని రాంబాబుకూడా టీడీపీ గురించి, చంద్రబాబుగారి గురించి మాట్లాడితే ఎలా? 

అకాలవర్షాలకు నష్టపోయి, తీవ్రకష్టాల్లోఉన్న రైతులవద్దకు వెళ్లి, వారిని పలకరిం చి, వారికష్టసుఖాలు తెలుసుకోలేని కాకాణి గోవర్థన్ రెడ్డి, చంద్రబాబుగారిని విమ ర్శించడం చూస్తుంటే, నవ్వొస్తోంది. జగన్ తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలు రం గులకే పరిమితమయ్యాయి తప్ప, తమకష్టాలుతీర్చడానికి కాదని వాపోతున్న రాష్ట్ర రైతాంగానికి ఏంసమాధానం చెబుతాడని కాకాణిని ఈ సందర్భంగా నిలదీ స్తున్నా. వైసీపీ సానుభూతిపరులైన రైతులుకూడా రైతుభరోసాకేంద్రాలతో తమ కు ఒరిగిందేమీలేదని వాపోతున్నారు.

 

*జగన్ తీసుకొచ్చిన బీసీఫెడరేషన్లు కేవలం అప్పులకోసమే, టీడీపీప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రాజకీయరిజర్వేషన్లకు కోతపెట్టి, వారికి 18వేలపదవులు దూరంచేసిన జగన్ బీసీలద్రోహికాక ఏమవుతాడు?*

టీడీపీఆవిర్భవించిందే బీసీలకోసం. బీసీలకు రాజకీయంగా పదవులిచ్చి, వారిని ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధిచేసింది స్వర్గీయ  ఎన్టీఆర్ గారు, చంద్రబాబులే.  బీసీల బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశంపార్టీ, బీసీలకు మాపార్టీ అమలుచేసిన పథకాలను జగన్ కాపీకొట్టాడు.  కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే బీసీలకు టీడీపీప్రభుత్వం కల్పించిన రాజకీయరిజర్వేషన్లకు కోతపెట్టి, వారికి 18వేలపదవుల్ని దక్కకుండా చేశాడు. అలాంటివాడు బీసీలద్రోహికాక ఏమవుతా డు? జగన్ తీసుకొచ్చిన బీసీ ఫెడరేషన్లు వెనుకబడినవర్గాలకు దేనికి పనికిరాకుండా పోయాయి. కేవలం అప్పులు తెచ్చుకోవడానికే జగన్ బీసీ ఫెడరేషన్లుపెట్టాడు. సంక్షేమంముసుగులో అన్నివర్గాల ప్రజల్ని చావు దెబ్బ కొట్టిన ముఖ్యమంత్రిగా  జగన్మోహన్ రెడ్డి చరిత్రలోనిలిచిపోతాడు. 

 

*17 మంత్రిపదవులు బీసీలకు ఇచ్చిన జగన్, వారిపై పెత్తనాన్నిమాత్రం రెడ్లకు ఎందుకు అప్పగించాడో జోగిరమేశ్ సహా, ఇతరబీసీమంత్రులు చెప్పాలి.* *టీడీపీ ట్రయల్ మేనిఫెస్టోకే ప్రభుత్వం, మంత్రులుఇలా అయిపోతే, అసలు మేనిఫెస్టో వస్తే అయిపులేకుండా పోతారేమో!*

17మంది బీసీలకు మంత్రిపదవులు ఇచ్చామంటున్నవారు, సజ్జలరామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి వారిచేతిలో కీలుబొమ్మలుగా మారింది నిజంకాదా?  రాష్ట్రాన్ని పాలిసున్నది ఎవరో జోగిరమేశ్ సమాధానంచెప్పాలి. తన శాఖకు సంబంధించి స్వతంత్రంగా ఒక్కనిర్ణయమైనా తీసుకునే అధికారం స్వేఛ్చ రమేశ్ కు ఉన్నాయా? బీసీల అభ్యున్నతికోసం చంద్రబాబుగారు ప్రత్యేకబడ్జెట్ ప్రవేశపెడితే, నాలుగేళ్లనుంచి బడ్జెట్లో బీసీలకు కేటాయిస్తున్ననిధుల్నివారికి తెలియకుండా పక్కదారి పట్టిస్తున్నది జగన్ కాదా? ఆదరణపథకాన్ని జగన్ ఎందుకు రద్దుచేశాడో ప్రభుత్వంలోని బీసీమంత్రులు సమాధానంచెప్పాలి.  వైనాట్ 175 అనివిర్రవీగుతున్నవారంతా, ఆదేనినాదాన్ని పచ్చబొట్లరూపంలో చేతులపై వేసుకుంటే, భవిష్యత్ లో చూసుకొని ఏడవడానికి పనికొస్తాయని సూచిస్తున్నా. జగన్మోహన్ రెడ్డిపై నిజంగా మంత్రులకు నమ్మకమే ఉంటే పచ్చ బొట్లు వేయించుకోవాలి. చంద్రబాబుగారు ట్రయల్ గా మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోదెబ్బకే ప్రభుత్వం, మంత్రులు ఇలామాట్లాడుతున్నారే, అసలైన మేనిఫెస్టోచూస్తే అయిపులేకుండాపోతారేమోనన్న సందేహం కలుగుతోంది. సమాజంలో వచ్చేమార్పులు, భవిష్యత్ పరిణామాలకు అనుగుణంగా చంద్రబా బుగారు ఆలోచిస్తుంటే, కేసులభయంతో రాష్ట్రాన్ని, ప్రజల్ని తాకట్టు పెట్టేదిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. సమాజవిధ్వంసకులుగా, అభివృద్ధి నిరోధకులుగా మారిన జగన్ అతని మంత్రివర్గం పనితీరు ప్రజల జీవితాల్ని తలకిందులు చేసింది.

                                                                                                                                                                                       *నాడు-నేడు పేరుతో జగన్ విద్యారంగాన్ని ఉద్ధిరిస్తే, ఏపీవిద్యార్థులు తెలంగాణలో ఎంసెట్ రాసి, అక్కడే చదువుకు ఎందుకు సిద్ధమయ్యారో మంత్రులు చెప్పాలి.* *చంద్రబాబు  తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, గురుకులపాఠశాలలు, స్టడీ సర్కిళ్లు, అంబేద్కర్ విదేశీవిద్య పథకాల్ని జగన్ ఎందుకు రద్దుచేశాడో మంత్రులు చెప్పాలి.*

 నాడు-నేడుపథకం పేరుతో రాష్ట్రవిద్యారంగాన్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పు కుంటున్నారు. ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఎంసెట్ రాసి, అక్కడే విద్యాభ్యాసం కొనసాగిస్తామనిచెప్పడమేనా జగన్  ఈ నాలుగేళ్లలో  విద్యారంగంలో సాధించిన పురోగతి? విదేశీ విద్యాదీవెన పథకానికి అంబేద్కర్ పేరుతీసేసి, జగన్ పేరు పెట్టినప్పుడే విద్యారంగంపై ఈముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమైంది. రాష్ట్రంలోని సహజవనరుల్ని దోచుకుంటూ, ప్రజల్ని తిప్పల పెడుతూ, రాష్ట్రాన్నిఅప్పుల్లో ముంచిన జగన్ అతని ప్రభుత్వం, అమ్మఒడిపేరుతో విద్యార్థుల జీవితాల్ని రోడ్డునపడేసింది. ఒకఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి కిందఆర్థికసాయం చేస్తానన్న జగన్, అధికారంలోకి వచ్చాక  ఒక్కరికే ఇస్తాననిచెప్పడం విద్యార్థుల్ని, వారితల్లుల్ని మోసగించడం కాదా? చంద్రబాబు దళితవిద్యార్థులు, యువతకోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైల బుల్ స్కూళ్లు, గురుకులపాఠశాలలు, స్టడీసర్కిళ్లు, అంబేద్కర్ విదేశీ విద్య వంటి పథకాల్నిరద్దుచేసినప్పుడే జగన్ విద్యకు, దళితబిడ్డలభవిష్యత్ కు  ఇస్తు న్న ప్రాధాన్యత ఏమిటో అర్థ మైంది. పీజీవిద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ ఎందుకు ఆపేశాడో జగన్ సమాధానంచెప్పాలి? విదేశీవిద్యపథకం కింద 4ఏళ్లలో ఎందరు దళితబిడ్డలను విదేశాలకు పంపాడో జగన్ సమాధానంచెప్పాలి. విదేశీ విద్యపథకంకింద ఎందరు బీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల్ని జగన్ విదేశాలకు పంపాడో, ఎందరికి ఆర్థికసాయంచేశాడో వాస్తవాలతో తక్షణమే శ్వేతపత్రం విడుద లచేయాలని డిమాండ్ చేస్తున్నాం. 

అన్నాక్యాంటీన్లు, విదేశీవిద్యపథకం, బీసీకార్పొరేషన్లకు రుణాలు, చంద్రన్నబీమా, దళితులకు సంబంధించిన 27పథకాల్ని ఎందుకు రద్దుచేశాడో జగన్ సమాధానం చెప్పాలి. రైతులకు జగన్ ఇస్తానన్న పంటలబీమా, గిట్టుబాటుధర, సబ్సిడీపై యాంత్రీకరణ పరికరాలు ఏమయ్యాయో  కాకాణి గోవర్థన్ రెడ్డిసమాధానం చెప్పా లి.

 

*మహానాడులో స్వర్గీయఎన్టీఆర్ ను చంద్రబాబుగౌరవించలేదు అంటున్న మంత్రులు, వైసీపీనేతలు జగన్ తనతల్లిని, చెల్లిని ఎంతగా గౌరవిస్తున్నాడో చెప్పా లి.* *4ఏళ్లలో ఢిల్లీనుంచి జగన్ రాష్ట్రానికి ఏంతీసుకొచ్చాడో తెలియచేస్తూ వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా?*

చంద్రబాబుపై దాడిచేయడం, టీడీపీపనితీరుని తప్పుపట్టడంతప్ప ప్రభుత్వానికి మంత్రులకు మరోపనిలేదు. ప్రజలగురించిన ఆలోచనలేదు. మహానాడులో స్వర్గీ య ఎన్టీఆర్ ను గౌరవించలేదంటున్న నీతిమాలినవ్యక్తులు, రాష్ట్రంలో మాతృభాష కు జగన్ చేస్తున్న తీరనిద్రోహం, అన్యాయంపై ఎందుకు మాట్లాడరు? తనతల్లిని, చెల్లిని జగన్ ఎంతబాగా గౌరవిస్తున్నాడో, ఆదరిస్తున్నాడో ఎందుకు సమాధానం చెప్పరు. రాష్ట్రాన్ని మాఫియాలకు కేంద్రంగా మార్చి, దీపం ఉండగానే ఇల్లుచక్కబె ట్టుకోవాలనే ధోరణిలో పదవుల్ని అడ్డంపెట్టుకొని అవినీతిలో, అక్రమసంపాదనలో మునిగితేలుతున్నవారు టీడీపీమేనిఫెస్టోపై, చంద్రబాబుగారిపై విమర్శలుచేయ డం హాస్యాస్పదంగా ఉంది. బాబాయ్ హత్య వ్యవహారంలో అబ్బాయి పాత్రేమిటో ఈ మంత్రులు సమాధానంచెప్పగలరా? వివేకానందరెడ్డిని ఎవరుచంపారో, అవి నాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా జగన్ ఎందుకు అడ్డుపడుతున్నాడో మంత్రులు మాట్లా డాలి. అప్పుడే వారివిశ్వసనీయత ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి, చట్టాల్నిపాతరేసి, దుర్మార్గపు పాలనచేస్తున్నవారు తగుదనమ్మా అనినీతులుచెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమం త్రి ఢిల్లీవెళ్లింది రాష్ట్రప్రయోజనాలు, ప్రజలకోసమా? పోలవరం నిర్మాణంచేయలేని వారు, నిర్వాసితులకు న్యాయంచేయలేనివారు, ప్రత్యేకహోదా తీసుకురాలేని అస మర్థులు అర్థరాత్రి కేంద్రమంత్రులతో మంతనాలు జరపడం రాష్ట్రంకోసమంటే ప్రజ లు నమ్మాలా? కేంద్రమంత్రి షెకావత్ ను జగన్ ఇప్పుడు దేనికి కలిశాడు? పోల వరంపై చర్చించడానికి ఏనాడూ ఏమంత్రిని కలవని జగన్ కు ఇప్పుడే పోలవరం గుర్తొచ్చిందా? జగన్ ఎప్పుడు ఢిల్లీవెళ్లినా కేంద్రంలోని పెద్దలకాళ్లకు మొక్కడం తప్ప, రాష్ట్రానికి సాధించిందేమీలేదు. ప్రత్యేకహోదా సహా కేంద్రం నుంచి జగన్ ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికిసాధించిన వాటిపై శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము, ధైర్యం ఈప్రభుత్వానికి ఉన్నాయా” అని ఆలపాటి సవాల్ చేశారు.

Comments