రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్ధిక స్వావలంబనకు అవసరమైన చర్యలు చేపడుతున్నది.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);రాష్ట్ర ప్రభుత్వం  మహిళల ఆర్ధిక స్వావలంబనకు అవసరమైన చర్యలు  చేపడుతున్నద


ని,  అందుకనుగుణంగా జిల్లాలో అర్హత వున్న ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు చేర్పించి  వారికి ఆర్ధిక తోడ్పాటు అందించడంతో పాటు  మహిళా అభ్యున్నతికి  కృషిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్,  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ    అధికారులను ఆదేశించారు. 


మంగళవారం ఉదయం కలెక్టరేట్  ప్రాంగణంలోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్,  డిఆర్డిఏ పిడి శ్రీ సాంబశివా రెడ్డి తో కలసి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరుపై   సంబంధిత డిపిఎం లు, ఎపిఎమ్ లు, ఏరియా కో ఆర్డినేటర్స్ తో   సమావేశమై మండలాల వారిగా సమీక్షించారు. తొలుత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ    ద్వారా అమలు జరుగుచున్న   స్వయం సహాయక సంఘాల పనితీరు, బ్యాంకు లింకేజి,  జగనన్న తోడు,    జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి,  వైఎస్ఆర్ భీమా, వైఎస్ఆర్ చేయూత, స్త్రీ నిధి , ఉన్నతి,  హౌసింగ్ లబ్దిదారులకు రుణాల మంజూరు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ పించన్ కానుక, సి డాప్ క్రింద అమలు జరుగుచున్న శిక్షణా కార్యక్రమాలు తదితర అంశాలకు సంబంధించిన నిర్దేశించిన   లక్ష్యాలు,  సాధించిన ప్రగతిపై పిడి శ్రీ సాంబశివా రెడ్డి సవివరంగా  వివరించారు.  

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం  మహిళల ఆర్ధిక స్వావలంబనకు అవసరమైన చర్యలు  చేపడుతున్నదని, అందుకనుగుణంగా  జిల్లాలో అర్హత వున్న ప్రతి మహిళ ను స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు చేర్పించి  వారికి ఆర్ధిక తోడ్పాటు అందించడంతో పాటు  వారి అభ్యున్నతికి కృషిచేయాలన్నారు. ముఖ్యంగా  ఎస్సి., ఎస్టి  స్వయం సహాయక సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించి  సమాజంలో ఎస్సి, ఎస్టి వర్గాలు ఆర్ధికంగా అభివృద్ది చెందేలా పనిచేయాల్సిన అవసరం వుందన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన  బుక్ కీపింగ్ ప్రక్రియ పై  మండలాల వారిగా  సమీక్షిస్తూ, బుక్ కీపింగ్ ప్రక్రియ పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జిల్లాలో  నూటికి నూరు శాతం  బుకింగ్  ప్రక్రియ పూర్తి కావాలని  స్పష్టం చేశారు.   స్త్రీ నిధి లో  తీసుకున్న రుణాలకు సంబంధించి  రుణాల రికవరీ శాతం తక్కువగా వుందని, 2022-23 సంవత్సరంలో  45 శాతం మాత్రమే వుందని,  ఎపిఎమ్ లు  రుణాల రికవరీ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని  జిల్లా కలెక్టర్, ఏపీఎంలను ఆదేశించారు.  మహిళల ఆర్ధికం స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం  వై.ఎస్.ఆర్ ఆసరా,  చేయూత, జగనన్న తోడు వంటి  సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్ధిక తోడ్పాటు అందించడం జరుగుచున్నదని, క్షేత్ర స్థాయిలో  అర్హత వున్న ప్రతి మహిళా లబ్ధిదారులు  ఈ పధకాలను సద్వినియోగం  చేసుకునేలా అధికారులు కృషిచేయాలన్నారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు  అర్హత వున్న ప్రతి ఒక్కరిని వై.ఎస్.ఆర్ భీమా పధకంలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పధకాలకు సంబంధించి అర్హత వున్న  ధరఖాస్తులన్నీ సంబంధిత బ్యాంకుల్లో నమోదు చేయాలని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.  వై.ఎస్.ఆర్ పింఛన్ కానుక కొరకు వచ్చిన ధరఖాస్తులను వారి అర్హతమేరకు నిర్ధిష్టమైన గడువులో పరిష్కరించాలని కలెక్టర్ , అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతీ,యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను సీడాప్ వారి సహకారంతో  చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడం తో పాటు  గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలుకల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. 

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిపిఎం లు,  ఏ.పి.ఎం లు, ఏరియా కో ఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.


Comments