రాజమండ్రి పార్లమెంటు పరిధిలో నాలుగు ఆర్వోబీలు మంజూరు.

 రాజమండ్రి పార్లమెంటు పరిధిలో నాలుగు ఆర్వోబీలు మంజూరు- రాజమండ్రి, అనపర్తి, నిడదవోలు, చాగల్లు రైల్వే సీఎల్ గేట్ల వద్ద ఆర్వోబీ నిర్మాణాలు


- రూ. జీక్యూ జీడీ కింద రూ.239.5 కోట్లతో ఆర్వోబీల నిర్మాణం


- రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్


రాజమండ్రి, మే 9 (ప్రజా అమరావతి): రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నాలుగు చోట్ల రైల్వే ఎల్ సీ గేట్ల వద్ద ఆర్వోబీలు మంజూరయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ‌మంగళవారం ఆయన న్యూ ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అనిల్ కుమార్ లాహోటీతో బేటీ అయ్యారు. అనంతరం ఆయన రాజమండ్రి మీడియాకు ఈ సమావేశం వివరాలను ఎంపీ భరత్ తెలిపారు. రాజమండ్రి, అనపర్తి, నిడదవోలు, చాగల్లు ప్రాంతాలలో రైల్వే ఎల్ సీ గేట్ల వద్ద ఆర్వోబీలను రూ.239.5 కోట్లతో నిర్మించేందుకు రైల్వే శాఖ మంత్రికి గతంలో నేనిచ్చిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తూ ఈ ఆర్వోబీలను శాంక్షన్ చేసినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలిపారని ఎంపీ భరత్ చెప్పారు. గోల్డెన్ క్వాడ్రిల్ లేటరల్ /డయాగ్నల్ రూట్స్ (జీక్యూ జీడీ) కింద ఈ నాలుగు ఆర్వోబీలు మంజూరయ్యాయని ఎంపీ భరత్ తెలిపారు. వీటిలో నిడదవోలు-చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య గల రైల్వే ఎల్ సీ గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ.54.77 కోట్లు, రాజమండ్రి నగరంలో అన్నపూర్ణమ్మ పేటలో ఎల్ సీ గేట్ వద్ద ఆర్వోబీకి రూ.74.23 కోట్లు, చాగల్లు యార్డ్ వద్ద రైల్వే ఎల్ సీ గేటు వద్ద రూ.54.98 కోట్లతోను, అనపర్తి-బిక్కవోలు రైల్వే స్టేషన్ల మధ్య గల రైల్వే ఎల్ సీ గేటు వద్ద రూ.55.52 కోట్లతో ఆర్వోబీ నిర్మించేందుకు సాంకేతికపరమైన అనుమతి ఉత్తర్వులు జారీ అయినట్టు ఎంపీ భరత్ తెలిపారు. ప్రస్తుతం ఆయా రైల్వే ఎల్సీ గేట్ల కారణంగా వాహనదారులు, పాదచారులు, వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతాలలో ఆర్వోబీ లు నిర్మించమని ప్రజాప్రతినిధులకు  ఆయా ప్రాంత వాసులు విన్నవించినా ఫలితం లేకపోయిందని పలువురు తన దృష్టికి తీసుకు రావడంతో వీటి మంజూరుకు కృషి చేసి, మొత్తంపై సాధించగలిగానని అన్నారు. ఈ ఆర్వోబీల నిర్మాణ వ్యయం పూర్తిగా రైల్వే శాఖే భరిస్తుందని ఎంపీ భరత్ తెలిపారు. తన కోరికను మన్నించి ఆర్వోబీలను శాంక్షన్ చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రికి,  రైల్వే బోర్డు ఛైర్మన్ కు ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments