నెల్లూరు:మే.2 (ప్రజా అమరావతి);
పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన స్థలాల విషయంలో కోర్టు స్టే లేని చోట ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాల
ని కలెక్టర్ ఎం. హరి నారాయణన్ ఆదేశించారు. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు పంపిణీ కాకుండా కోర్టు కేసుల వల్ల పెండింగ్ ఉన్న వాటిపై కలెక్టర్ మంగళవారం రాత్రి ఆర్డీవోలు, హౌసింగ్ అధికారులతో సమీక్ష చేశారు. కోర్టులు స్టే ఇచ్చిన కేసులలో స్టేవెకేషన్ పిటిషన్ వెయ్యాలని సూచించారు. కొద్ది సంఖ్యలో పట్టాలు పంపిణీ ఉన్న గ్రామాలలో ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారని ఆర్డీవోలను నిలదీశారు. లే అవుట్ కు సంబంధించిన విషయాల వల్ల గృహాల మంజూరుకు సమస్యలు ఎదురైతే ఆర్డీవోలు దృష్టికి తీసుకు వెళ్లాలని హౌసింగ్ అధికారులకు సూచించారు .
ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మనాద్, సబ్ కలెక్టర్ శోభిక ఆర్డీవోలు మాలోల, శీనా నాయక్, కరుణ కుమారి ,హౌసింగ్ పీడీ వెంకట దాసు ఈ ఈలు పాల్గొన్నారు.
addComments
Post a Comment