రేపు (02–06–2023, శుక్రవారం) సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గుంటూరు జిల్లా పర్యటన.


అమరావతి (ప్రజా అమరావతి);


*రేపు (02–06–2023, శుక్రవారం) సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గుంటూరు జిల్లా పర్యటన.* 


*గుంటూరులో వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.*


శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని, అక్కడ నుంచి చుట్టుగుంట వెళ్తారు. 

చుట్టుగుంటలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులుకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభిస్తారు.

కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Comments