ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం.

 ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం


జిల్లాలో ప్రతిరోజు లక్ష   ఉపాధిపని దినాలు కల్పించాలి


ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు చేయాలి

గడపగడపకు పనులకు నిధుల కొరత లేదు


జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు



పుట్టపర్తి, జూన్ 16 (ప్రజా అమరావతి):  ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించడం  అర్హులేవరు మిగిలిపోకుండా  పథకాలనుఅందించడమే లక్ష్యంగా ఈనెల 23వ  నుంచి జూలై 23వ వరకు  జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రణాళికలో రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలు నందుజగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షా కార్యక్రమం. ఉధృతంగా ఉపాధి, ఇల్లు నిర్మాణాలు, విత్తనాలు ఎరువులు,  ఈ క్రాఫ్ట్ బుకింగ్, గడపగడపకు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ భవనాల నిర్మాణం పనులపై, వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో మరియు మండల స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్  కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, ట్రైన్ ని డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి  వివరించాలని తెలిపారు.ఆ ఇంటికి సంబంధించి ఏ రకమైన వినతి అయినా..  ఏదైనా పత్రాలకు సంబంధించి కానీ, డెత్, ఇన్‌కం, మ్యారేజీ సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై జల్లెడపడతారు. తెలిపారు

ఒక్కరు కూడా సచివాలయంలో మిస్‌ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి.

మండల స్ధాయిలో ఎంపిడీఓ, డిప్యూటీ తహశీల్దార్‌ , ఒక టీం, తహశీల్దార్, ఈవో పంచాయతీరాజ్‌ కలిసి రెండు టీమ్‌లుగా ఏర్పడతాయి.ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి. సచివాలయానికి వస్తున్న తేదీ వివరాలను ముందే నిర్ణయించి, ఆ రోజు నాటికి గ్రామంలో ఉన్న క్షేత్రస్ధాయి సిబ్బంది  ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.  నెలరోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడపడతారు ప్రతిరోజు ఒక టీం ఒక్కొక్క సచివాలయాన్ని మాత్రమే సందర్శించాలని తెలిపారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు.సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారికి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు.దీనివల్ల ఈ సమస్యలు మళ్లీ రాకుండా పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. సచివాలయం నందు ప్రత్యేక డస్కులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, స్పందన, జగనన్నకు చెబుదాం డస్కులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో పై నెలరోజు కార్యక్రమాలు  నిర్వహించుకోవాలని తెలిపారు. రేపటి నుంచి పై కార్యక్రమాలపై మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్, సిబ్బంది ఒక టీంగానూ, ఏర్పాటు చేసుకొని  వివిధవార్డుల్లో పర్యటిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం 23 జూన్‌ నుంచి 23 జూలై వరకు నెలరోజుల పాటు జరుగుతుంది. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారు.


గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం. అమలలో భాగంగా1720 పనులు ఆమోదించడం జరిగిందని. 1308 పనులు  వివిధ  దశలలో జరుగుతూ ఉన్నాయని 174  పనులకు సంబంధించిన బిల్లులకు మాత్రమే అప్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు.జరిగిన పనులకు బిల్లులు అప్లోడ్ చేస్తే వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ముదిగుబ్బ, ధర్మవరం, తాడిమర్రి, కదిరి, పెనుగొండ మండలాలలో పంచాయతి రాజ్ పనులకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేయాలని ఆయా ఎంపిడిఓ లను ఆదేశించారు. సోమవారం లోపల బిల్లులు అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌:

ప్రతిరోజూ  జిల్లాలో కనీసం 1,00,000 పనిదినాలు కల్పించాలి.అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 11గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటలవరకూ ఎలాంటి పనులు చేపట్టవద్దు.ఈ విషయాలన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. రోజుకు కనీసంగా రూ.272లు వేతనం వచ్చేలా చూడాలి అనిDwma పిడిని  ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌ అన్నీ కూడా సెప్టెంబరు కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి నీ తెలిపారు

జగనన్న హౌసింగ్‌.

జిల్లాలు జూలై 15 నాటికి 4,500 ఇల్లు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు ప్రతిరోజు సంబంధిత అధికారులు

ఎప్పటికప్పుడు  జగనన్న వైయస్సార్ కాలనీలోపర్యవేక్షించాలి. తెలిపారు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడండి. నాణ్యత అనేది చాలా ముఖ్యం.

ఎక్కడైనా నకిలీలు, కల్తీలు కనిపిస్తే. వ్యవసాయ అధికారులను  బాధ్యుల్ని చేస్తాను. నకిలీలు కారణంగా రైతులు ఎక్కడా నష్టపోయిన సందర్భాలు కనిపించకూడదు. క్రమం తప్పకుండా తనిఖీలు చేయండి అని వ్యవసాయ అధికారులను ఆదేశించారు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు,సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి,  ఐసిడిఎస్ పిడి కృష్ణ కుమారి, జిల్లా రిజిస్టర్ కృష్ణకుమారి, రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి మాధవి,  డ్వామా పిడి రామాంజనేయులు, ఇంచార్జి డిఈఓ రంగస్వామి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ డిఈఈ మోసెస్, బిసి వెల్ఫేర్ డిడి నిర్మలాజ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments