4 ఏళ్లలో జగన్ అమలుచేసిన సంక్షేమపథకాలు రాష్ట్రంలో పేదరికం పోగొట్టాయా?

 అమరావతి (ప్రజా అమరావతి);


 టీడీపీ మేనిఫెస్టో అంటే జగన్ కు ఎందుకంత భయం? చంద్రబాబు మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే తనకు, తనపార్టీకి పుట్టగతులుండవన్న భయంతోనే జగన్ నోటికొచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. విజనరీ నాయకుడి ఆలోచనలు ప్రిజనరీ జగన్ కు ఏంతెలుస్తాయి?

 

 ప్రజల్లోకివెళ్లి చేసిందిచెప్పుకొని,  ధైర్యంగా పోటీ చేసేసత్తా జగన్  కు లేదు కనకే.. టీడీపీ మేనిఫెస్టో చూడగానే  పిచ్చికూతలు కూస్తున్నాడు.

 4 ఏళ్లలో జగన్ అమలుచేసిన సంక్షేమపథకాలు రాష్ట్రంలో పేదరికం పోగొట్టాయా?


ప్రజల జీవనప్రమాణాలు పెంచాయా? 

 జగన్  ఏలుబడిలో రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం ఎందుకు అగ్రస్థానంలో నిలిచింది?. మహిళలపై అఘాయిత్యాల్లో, దళితులపై దాడుల్లో ఎందుకు ప్రపంచప్రఖ్యాతి పొందింది? యువత ఉద్యోగాలకోసం, ఉద్యోగులు జీతాలకోసం ఉద్యోగులు ఎందుకు చేతులుచాస్తున్నారు?  

  ఆలపాటి రాజేంద్రప్రసాద్  (మాజీమంత్రి) 


రైతుభరోసా బటన్ నొక్కుడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడుతూ,  ప్రజల్ని మరోసారి మోసగించే ప్రయత్నం చేశాడని, విజనరీ చంద్రబాబు మహానా డులో విడుదలచేసిన మేనిఫెస్టోపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రిజనరీ మాటల్లానే ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటిరాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. 

జగన్మో హన్ రెడ్డి పాలనలో అన్నివిధాలనష్టపోయిన అన్నివర్గాలను భరోసా కల్పిస్తూ చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు.

చంద్రబాబుగారు తొలిసారి 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడే తన దార్శనికత, దూరదృష్టితో విజన్ – 2020 ఆనిఆలోచన చేశారు.  ఆనాటి ఆయన ఆలోచనల్ని గ్రహిస్తే, జగన్మోహన్ రెడ్డి కాపీమాస్టరో, ఆయనప్రభుత్వం కాపీప్రభు త్వమో తెలుస్తుంది. రాష్ట్రాభివృద్ధికోసం 29గ్రామాలప్రజలు ప్రాణసమానమైన భూముల్ని రాజధానికోసంఇస్తే, మూడురాజధానుల నాటకంతో రాష్ట్రాన్నిసర్వ నాశనంచేసింది ఈ జగన్మోహన్ రెడ్డి పైశాచికఆలోచనలు కాదా? తన రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని నామరూపాలులేకుండా చేసినఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రి మరెవరూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపుపాలనలో అన్నివి ధాలా మోసపోయిన మహిళలు, బీసీలు, రైతులు, యువత జీవితాలకు భరోసా కల్పిస్తూ, వారిభవిష్యత్ కు నాది హామీ అంటూ చంద్రబాబుగారు మేనిఫెస్టో ప్రక టించారు. మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని చెప్పిన జగన్ ఈ 4ఏళ్లలో ప్రజలకు ఏంన్యాయంచేశాడో చెబుతూ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందునిలిపిన ఏకైకవ్యక్తి చంద్రబాబే. ఈ మాట రాష్ట్రంలో ఏమహిళను అడిగినా చెబుతుంది.

 

4ఏళ్లలో జగన్ అమలుచేసిన సంక్షేమపథకాలు రాష్ట్రంలో పేదరికం పోగొట్టాయా? ప్రజల జీవనప్రమాణాలు పెంచాయా?* *జగన్  ఏలుబడిలో రైతుల ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... మహిళలు ఎందుకు బోరుమంటున్నారు.. ఉద్యోగులు ఎందుకు నిరసనతెలుపుతున్నారు?

వచ్చేఎన్నికల్లో జరిగేది క్లాస్ వార్ అని ముఖ్యమంత్రి చెప్పడం ముమ్మాటికీ ఆయన అబద్ధాలకు పరాకాష్టే. 4ఏళ్లపాలనలో రాష్ట్రంలో ఎవరికి న్యాయంచేశాడో, ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. జగన్ చెబుతున్న సంక్షేమపథకాలు పేదల పేదరికం పోగొట్టడానికి, ప్రజల జీవనప్రమాణాలుపెంచడానికి ఎంతవరకు దోహద పడ్డాయో ప్రభుత్వం చెప్పాలి. పేదల్ని మరింత దిగజార్చేలా జగన్ పాలన కొనసా గింది. ఆయన చెబుతున్న డీ.బీ.టీ స్కీమ్ ప్రజలజీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని ఘంటాపథంగా చెప్పగలం. పేదలు, మధ్యతరగతిప్రజలు, వారి పిల్లలచదువులకు, వారికి అవసరమైన ఉద్యోగాలకల్పనకు, వారి వైద్యానికి, కనీసమౌలికసదుపాయాల కల్పనకు జగన్మోహన్ రెడ్డి 4ఏళ్లలో ఏంచేశాడు? ఆఖరికి కరోనాసమయంలోకూడా ప్రజల ప్రాణాలుకాపాడలేని అసమర్థ ముఖ్య మంత్రిగా జగన్ చరిత్రకెక్కాడు. జగన్ పాలన బ్రహ్మండంగా ఉంటే, ప్రజలు ఎందు కు ఆయన సభలు, సమావేశాలనుంచి పారిపోతున్నారు. ఉద్యోగులు ఎందుకు నిరసనవ్యక్తంచేస్తున్నారు? కాంట్రాక్టర్లు, రైతులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు? మహిళలు కన్నీళ్లు, కష్టాలతో రోజులు ఎందుకు వెళ్లదీస్తు న్నారు? దీపంఉండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ఇసుక, మద్యం, మైనింగ్ దందాలు, భూకబ్జాలతో వేలకోట్లు దోచుకుంటున్నారు.


ఎన్టీఆర్ గురించి మాట్లాడేనైతిక అర్హత జగన్ కు లేదు.. తనబాబాయ్ చావు గురించి ముఖ్యమంత్రి నోరుతెరిస్తే వినాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 స్వర్గీయ ఎన్టీఆర్ గురించి మాట్లాడే  నైతికత జగన్ కు లేదు. తనబాబాయ్ హత్య గురించి ముఖ్యమంత్రి ఎందుకు నోరెత్తడు? ఆయన నోరువిప్పి ఏంచెబుతాడా అని ప్రజలు ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. తనతల్లి, చెల్లి తనను వదిలేసి ఎందుకు వెళ్లిపోయారో జగన్ ప్రజలకు చెప్పాలి. సొంతబాబాయ్ కూతురే జగన్ ను నమ్మలేక ఢిల్లీచుట్టూ, కోర్టులచుట్టూ ఎందుకు తిరుగుతోందో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానంచెప్పాలి. కుటుంబానికి న్యాయంచేయలేని మనిషి, రాష్ట్రాన్ని, ప్రజల్ని ఉద్ధరిస్తాడా?


రాష్ట్రంలో వ్యక్తిగతస్వేచ్ఛ, ప్రజలహక్కులు హరించబడుతున్నాయన్న అమెరికా విదేశాంగశాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలపై ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడు?

                                                                                                                                                                                        రాష్ట్రంలో తనహాయాంలోనే రైతులఆత్మహత్యలు ఎందుకు ఎక్కువగా నమోదయ్యాయో ముఖ్యమంత్రి చెప్పాలి? మహిళలపై అఘాయిత్యాలు, దారుణాల్లో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఎందుకుందో జగన్ నోరువిప్పాలి. ఇవేవీ తాము చెబుతున్నవికావు... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలేచెబుతున్నాయి. దేశంలో నే కాదు... ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రపరువు, ప్రతిష్టలు మంటగలిశాయని అమెరికా విదేశాంఖశాఖే తేల్చింది. రాష్ట్రంలో మానవహక్కులు, స్వేఛ్ఛ ఏ రకంగా దిగజారిపోతున్నాయో ఏకరవుపెట్టింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు, పాలకుల్ని ప్రశ్నించేవారిని ఏ రకంగా అణచివేస్తున్నారో కనిపిస్తోంది. ఇవేవీ ప్రజలకు తెలి యవన్నట్టు జగన్ కర్నూలుసభలో సుద్దులు చెప్పడం సిగ్గుచేటు.


నాలుగ్గోడలమధ్యకాదు.. నలుగురి మధ్యన చేసేదే నిజమైన రాజకీయమన్న ఎన్టీఆర్ మాటల్ని చంద్రబాబు, లోకేశ్ లు చేతల్లో చూపిస్తుంటే, ప్రజల మనిషిని అని చెప్పుకుంటున్న జగన్ పరదాలు, పోలీసులమధ్య దాక్కుంటున్నాడు.

                                                                                                                                                                                   చంద్రబాబు, టీడీపీయువనేత లోకేశ్ దర్జాగా, రాజుల్లా ప్రజల్లో తిరుగుతుంటే, ముఖ్యమంత్రిస్థానంలోఉన్న వ్యక్తి దొంగలాగాదాక్కొని పరదాలు, పోలీసుల సాయంతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. నాలుగ్గోడలమధ్య చేసేదికాదు రాజకీయం.. నలుగురిలో చేసేదే రాజకీయమన్న మా నాయకుడు స్వర్గీయఎన్టీఆర్ మాటల్ని నిజంచేసేలా చంద్రబాబు, లోకేశ్ లు ప్రజల్లో తిరుగుతున్నారు. సంక్షేమం అనే మాటకు కొత్తనిర్వచనం చెప్పిందే తెలుగుదేశంపార్టీ. పేదలకడుపు నింపే కార్యక్ర మాలతో పాటు, వారికి ఉండటానికి ఇల్లు, కట్టడానికి బట్ట ఇచ్చింది టీడీపీనే. చంద్రబాబు పేదలకోసం ప్రవేశపెట్టిన అన్నాక్యాంటీన్లు, చంద్రన్నబీమా, సబ్ ప్లాన్ అమలు, విదేశీవిద్య, రంజాన్ తోఫా, దుల్హన్ వంటి ఎన్నోపథకాల్ని రద్దుచేసిన జగన్ పేదలకోసంపనిచేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు.  చంద్రబాబుహాయాంలో విదేశీవిద్య పథకంకింద 4,500మంది యువత విదేశాలకు వెళ్తే జగన్ 4ఏళ్లపాల నలో కేవలం 216మంది మాత్రమే వెళ్లారు. ఆ 216మందిలో ఎందరు బీసీలు, ఎస్సీలు ఉన్నారో సమాధానంచెప్పమంటే ప్రభుత్వంలో స్పందనలేదు. 

జగన్ 4ఏళ్లలో తీసుకొచ్చింది జాబ్ లెస్ క్యాలెండరే. ఉన్నతచదువులు చదివిన యువతను మాంసంకొట్లు, చికెన్ షాపుల, మద్యందుకాణాల్లో పెట్టిన ఘనుడు ఈముఖ్యమంత్రి. రైతుల్ని, ఉద్యోగుల్ని మోసగిస్తూ, వ్యాపారాలపై దాడిచేస్తూ, ప్రజల్ని వేధిస్తూ సాగిస్తున్న పాలన కూడా ఒకపరిపాలనేనా? కర్ణాటక, తెలంగా ణ, తమిళనాడు రాష్ట్రాలు బ్యాన్ చేసిన అమూల్ సంస్థ జగన్మోహన్ రెడ్డికే ఎందు కు నచ్చింది? స్థానికంగా ఆయారాష్ట్రాల్లోని పాడిపరిశ్రమల మనుగడదెబ్బతినేలా అమూల్ సంస్థనిర్ణయాలు, వ్యాపారఆలోచనలు ఉన్నాయనే ఆయారాష్ట్రాలు  ఆ సంస్థను తిరస్కరించాయి. కానీ జగన్ తనకమీషన్లకోసం, పాలసమాఖ్యలు, కొన్ని సహకారడెయిరీలపై ఉన్న అక్కసుతో అమూల్ కు స్వాగతంపలికాడు. దానితో పాడిరైతుల జీవితాలు బాగుపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం పచ్చి అబద్దమే. రాష్ట్రంలోని పాలఉత్పత్తిదారుల్ని నాశనంచేసేలా జగన్ అమూల్ సంస్థ కు ప్రజలసొమ్ము దోచిపెడుతున్నాడు.

 

ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోఉన్నా చంద్రబాబు ప్రజలకోసమే పనిచేశారు.. తనస్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని, ప్రజల్ని తాకట్టుపెట్టిన ఘనుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు.

                                                                                                                                                                                          రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించకుండా గిట్టుబాటుధరకల్పించకుండా వారిని ఉద్ధరిస్తున్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అకాలవర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి వారివద్దకు వెళ్ల లేని చేతగానిముఖ్యమంత్రి  నేడు మైకులుముందు తానురైతులపక్షం అని చెప్ప డం కపటనాటకమే. లౌకకవాదాన్ని కాపాడేవిషయంలో అయినా, రాష్ట్రాన్ని అభి వృద్ధిచేయడంలోగానీ, సంక్షేమంలో గానీ చంద్రబాబు కాలిగోటికి కూడా జగన్ సరిపోడు. ప్రజలసంపదను, రాష్ట్రవనరుల్ని దోచుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. వేలకోట్లు కొట్టేసి, అనేకనగరాల్లో భారీప్యాలెస్ లు కట్టుకున్న జగన్మో హన్ రెడ్డి పేదవాడా? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా బాధ్యతతో, ప్రజలకోసమే పనిచేశారు. గతంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపెంపును నిరసిస్తూ ధర్నాచేశారు. ఆనాడు జగన్ పార్లమెంట్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పెదవి విప్పలేదు. ముఖ్యమంత్రి అయ్యాక తన స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టుపెట్టడంలో జగన్  విజయవంతమయ్యాడు. ప్రజల్ని మోసగిస్తూ వారికి పప్పుబెల్లాలు పంచి, తానుమాత్రం లక్షలకోట్లు కొట్టే శాడు. 4ఏళ్లరాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.13లక్షలకోట్లు అయితే, జగన్ ప్రజలకు పంచింది కేవలం రూ.2.23లక్షలకోట్లే. మిగిలినసొమ్ము అంతా జగన్ తన ప్యాలెస్ లలో భద్రపరిచాడు. సెంటుపట్టాపేరుతో ప్రజల్ని వంచిస్తూ, ఇళ్లస్థలాల నాటకానికి తెరలేపాడు. చంద్రబాబు పేదలకోసం అన్నిహంగులతో కట్టించిన లక్షలాదిటిడ్కోఇళ్లను జగన్ 4ఏళ్లుగా ఎందుకు పాడుపెట్టాడు? జగన్ ఇచ్చే సెంటుస్థలంలో పేదలుసొంత డబ్బుతో ఇళ్లుకట్టుకునే పరిస్థితికల్పించడం వారికి న్యాయంచేసినట్టా? ఉమ్మడి రాష్ట్రంలో 294నియోజకవర్గాల్గో చక్రంతిప్పిన తెలుగుదేశంపార్టీతో నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీపోటీపడుతుందా?

 నన్ను నమ్మండి అని ప్రజలఇంటి తలుపు లపై స్టిక్కర్లు వేయిస్తున్న జగన్ కు నిజంగా దమ్ము,ధైర్యముంటే, వైనాట్ 175 అనే పచ్చబొట్లు తనపార్టీ ఎమ్మె ల్యేలు, మంత్రులకు వేయించాలి.  ఆ పచ్చ బొట్లతో ప్రజల్లోకి వెళ్లి నిర్భయంగా తిరిగే ధైర్యం వైసీపీనేతలకుఉందా? ప్రజల్లోకివెళ్లి చేసిందిచెప్పుకొని,  ధైర్యంగా పోటీ చేసేసత్తా జగన్ కు లేదు కనకే.. టీడీపీ మేనిఫెస్టో చూడగానే  పిచ్చికూతలు కూస్తున్నాడు. జగన్ కు టీడీపీ మినీమేనిఫెస్టో అంటే ఎందుకంతభయం? తనమాటలు, భయంద్వారా టీడీపీ మేనిఫెస్టోనుప్రజలు ఆదరిస్తున్నారని జగన్ చెప్పకనే చెబుతున్నాడు.” అని ఆలపాటి స్పష్టంచేశారు.

Comments