బాణసంచా గోడౌన్‌ ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం.*బాణసంచా గోడౌన్‌ ప్రమాదంలో మరణించిన ముగ్గురు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం*


అమరావతి (ప్రజా అమరావతి):

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. బాణా సంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించారు. మరణించిన వారంతూ చాలా పేదవాళ్లని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోజువారీ కూలీలను సమాచారం తెలుసుకున్న సీఎం… ఈ విధంగా స్పందించారు. ఆయా కుటుంబాను ఆదుకునేలా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఎక్స్‌గ్రేషియాను వారి కుటుంబాలకు అందించాలన్నారు.

Comments