నీటి నిల్వ కొరకు చెరువులు మరియు కుంటలు పునరుద్దించాలి.

 నీటి నిల్వ కొరకు చెరువులు మరియు కుంటలు పునరుద్దించాలి


మిషన్ అమృత సరోవర్ జాయింట్ సెక్రెటరీ

తనుజ టక్కర్

  

పుట్టపర్తి,  జూన్ 1 (ప్రజా అమరావతి):  నీటి నిల్వ కొరకు చెరువులు మరియు కుంటలు పునరుద్దించాలని జాతీయ మిషన్ అమృత సరోవర్ జాయింట్ సెక్రెటరీ తను జట్టకర్ పేర్కొన్నారు. జిల్లాలో రెండు రోజు పర్యటనలో భాగంగా  అమృత సరోవర పనులను పరిశీలించడానికి ఆమె క్షేత్రస్థాయిలో రేపు  పలుప్రాంతాలలో పర్యటించునున్నారు. గురువారం  స్థానిక కలెక్టరేట్లోని  మినీ కన్ఫరెన్స్   హాలు నందు  జిల్లా  అమృత సరోవర పనులు, రాష్ట్రంలో చేపట్టిన అమృత సరోవరం పనులను సంబంధిత అధికారులు  పవర్ ప్రజెంటేషన్ సమర్పించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు,  శివప్రసాద్  జాయింట్ కమిషనర్, చిన్న తాతయ్య డైరెక్టర్,  Dwma pd  రామాంజనేయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూదేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'అమృత్ సరోవర్' కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానం సంపాందించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో ప్రకటించింది.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'అమృత్ సరోవర్' కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సంపాదించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పది వేల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉండేలా ఈ చెరువులను నిర్మించాలని ని ఆమె పేర్కొన్నారు

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా 2,033 చెరువులను నిర్మించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1,950 చెరువుల పనులు ప్రారంభమయ్యాయి.  69 లక్షలు మందికి  జాబ్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని. 2300 కోట్ల రూపాయలు  ఖర్చు చేయడం జరిగిందని  జాయింట్ కమిషనర్  వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఅమృత సరోవరంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 10 వేల  క్యూసిక్కుల నీటిని   నిల్వ  చేసే ట్యాంకులు 80  ట్యాంకులు  నిర్మించడానికి ప్రణాళికలు అమలు చేయుచున్నామని తెలిపారు. ఇప్పటికే 70  చెరువులు అభివృద్ధి చేయుట, చెరువులలో పూడుకుతీత పనులు చేపట్టుట, సామాజిక వన కార్యక్రమాలు చేపట్టుట మొదలైన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని గణాంకాలు వెల్లడించారు.   నీటి కుంటలు నిర్మించడం వల్ల రైతులు ఉద్యానవన పంటలపై ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, ఏపీ డీలు, పిఆర్ ఇంజనీర్లు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments