రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఉన్న నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఉన్న నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి  ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు  చేయడం జరుగుతుంద


ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. 


సోమవారం స్థానిక దానవాయి పేట లోని ప్రైవేట్ ఆస్పత్రులపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి క్రమంగా ప్రతి నెల 5 నుండి 6 ఆసుపత్రులను పై నిఘా ఉంచి  తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తనిఖీ నోటిఫైడ్ డిసీజ్ లను విధిగా ఆన్లైన్లో ఉంచి, హెచ్ఎంఐఎస్ (HMIS) పోర్టల్ కు అనుసంధానం చేయాలన్నారు. జనన ధ్రువీకరణ వివరాలు పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. సరైన కారణాలు లేకుండా  అబార్షన్ చేయరాదని, లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధిత చట్టం పటిష్టంగా అమలు పర్చాలని, ఆరోగ్యశ్రీ రోగుల నుంచి   సొమ్ము వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ నియమ నిబంధనలు అతిక్రమించిన ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Comments