నెల్లూరు: జూన్ 19 (ప్రజా అమరావతి);.
జిల్లాలో ఆరోగ్య మిత్రలు గా మంచి సేవలు అందించిన ఇద్దరిని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.హరి నారాయణన్ అభినందించారు
.ఈ మేరకు సీఈవో, వైయస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి పంపిన 5000 రూపాయల చెక్కులను, ప్రశంసా పత్రాలను కలెక్టర్ సోమవారం తిక్కన ప్రాంగణంలోఇద్దరికి కలెక్టర్ అందజేశారు. వైద్య అవసరాల కోసం వచ్చే పేద ప్రజలకు ఆరోగ్య మిత్రలు అందరూ మంచి సేవలు అందించి ప్రజల,ప్రభుత్వ మన్ననలు పొందాలన్నారు.
నెల్లూరు జిజిహెచ్ లో ఆరోగ్య మిత్ర గా పనిచేస్తున్న A.దీప్తికి ఏప్రిల్ నెలకు గాను ,కావలి పట్టణం లోని కందుకూరి ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రగా పనిచేస్తున్న K. శిరీషకు మే నెలకు గాను పనితీరును పరిగణలోకి తీసుకుని సీఈఓ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు వీరిద్దరిని సేవా మిత్రలుగా గుర్తించి, ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల చెక్కు, ప్రశంసా పత్రాన్ని పంపించారని, వాటిని జిల్లా కలెక్టర్ చేతుల మీదగా వారిద్దరికి అందించడం జరిగిందని వైయస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు.
addComments
Post a Comment