సంపద సృష్టించి ఆ సంపదను సంక్షేమం రూపంలో ప్రజలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ.

అమరావతి (ప్రజా అమరావతి);

టీడీపీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం 

రెండు  తెలుగు రాష్ట్రాలు విడిపోయి  నేటికి 9 ఏళ్లు పూర్తయ్యాయి.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. 

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే, ఎన్టీఆర్ తెలుగుజాతి అభ్యున్నతి కోసం  టీడీపీని స్దాపించారు.

తెలుగు జాతి అభివృద్ది కోసం విజన్ 2020 రూపొందించి  అతి తక్కువ కాలంలోనే ప్రపంచలో  ఎవరూ సాధించలేని విజయాలు సాధించాం. 

ఆర్దిక సంస్కరణలకు నాంది పలికిన పీవీ నరసింహరావు మన తెలుగుబిడ్డ.

తెలుగుజాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేస్తే, ఆర్దిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి  పీవీ నరసింహరావు, ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని పెంచారు.

1995 లో నేను సీఎంగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రంలో సెకండరీ జెనరేషన్ రిఫార్మ్స్  అమలు చేశాం.

టెక్నాలజీని అందింపుచ్చుకుని ముందుకెళ్లాం, దాని పలితమే నేడు తెలంగాణ ఐటీలో నెం. 1  స్ధానంలో ఉంది. 

సంపద సృష్టించి ఆ సంపదను సంక్షేమం రూపంలో ప్రజలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ.


విభజన సమయంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని సమన్యాయం చేయాలని టీడీపీ పోరాడింది.

నాడు 16 వేల కోట్ల లోటు బడ్జెట్, విభజన వల్ల వచ్చిన రూ. 1 లక్షా 10 కోట్ల రూపాయలు అప్పు,  22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో  పాలన ప్రారంభించాం.

విభజన గాయాలు మర్చిపోయి రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునేందుకు నవ నిర్మాణ దీక్ష సంకల్పం తీసుకున్నాం. ఏపీని సన్ రైజ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం.

ప్రతి ఏటా జూన్ 2  రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరిపాం, కానీ నేడు కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేని దుస్ధితిలో సీఎం ఉన్నారు.

పోలవరం, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు.

పోలవరం 72 శాతం పూర్తి చేశాం, సాగునీటి ప్రాజెక్టులకు రూ.  64 వేల కోట్లు ఖర్చు చేశాం.

వ్యవసాయంతో పాటు సమానంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేశాం. 

సమస్యలు, సవాళ్లు అధిగమించి విజన్ 2029 తయరు చేశాం,  ఏపీ నెం. 1గా ఉండాలని విజన్ రూపొందించాం. 

శివరామకృష్ణన్ కమిటీ సూచన మేరకు అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని అమరావతికి రూపకల్పన చేశాం.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి స్వచ్చందంగా ఇచ్చారు. 

నాడు టీడీపీ ప్రభుత్వ కృషితో అమరావతికి 139 సంస్థలు వచ్చాయి, 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఆ ఒప్పందాలు కొనసాగి ఉంటే 30 లక్షల మందికి ఉపాధి లభించేది.

రాజధానిలోని మిగులు భూమి విలువ పెరిగి ప్రభుత్వానికి సుమారు రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది.

అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అంగీకరించింది, విజయవాడ గుంటూరు మద్యలో రాజధాని ఉండాలని 30 వేల ఎకరాలుండాలని చెప్పారు.

కానీ మాట మార్చి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడుతున్నారు.

9 ఏళ్లయినా రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్ధితి. 

భూములిచ్చిన రైతులు 1200 రోజుల నుంచి తిండి తిప్పలు మాని రోడ్లపై ఉద్యమం చేయాల్సి రావటం బాధాకరం.  

పట్టి సీమ ద్వారా కృష్ణ డెల్టాకి నీళ్చిచ్చాం, ప్రతి వారం సోమవారం పేరుతో పోలవరం పనులు పరుగులు పెట్టించి  72 శాతం పూర్తి చేశాం. 

కానీ జగన్ కేంద్రం చెప్పినా వినకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుని రివర్స్ లో పెట్టారు. 

వరదలు వచ్చి డయాప్రంవాల్, కాఫర్ డ్యాంలు  దెబ్బతిన్నాయి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయాప్రంవాల్ దెబ్బతిన్నదని  హైదరాబాద్ ఐఐటీ నివేదిక ఇచ్చింది. 

పోలవరం ఎత్తు  41.51 మీటర్లు నిర్మిస్తే ఎలా?  45 మీటర్లు నిర్మిస్తేనే సుమారు 170 టీఎంసీ నీళ్లు నిల్వ చేసే అవకాశం ఉంటంది,  హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 

సిగ్గులేకుండా పోలవరేం ఫేజ్ 1 - 2025 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు, అదే  టీడీపీ అదికారంలోకి ఉంటే 2020 జూన్ కే పూర్తయ్యేది.

ఇప్పుడు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలియని దుస్దితి,  దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పోలవరాన్ని నాశనం చేసి రాష్ర ప్రగతిని అడ్డుకున్నారు. 

ప్రపంచమంతా తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చాం, ఈజ్ ఆప్ డూయింగ్ లో వరుసగా నెం. 1 స్ధానంలో  నిలిచాం.

రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 5.13 లక్షల ఉద్యోగాలు కల్పించాం. 

నేడు ఎప్డీఐలో 10 వ స్ధానంలో ఉన్నాం,  ఏపీ ఐటి ఎగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. 

మద్యం, గంజాయి మాఫియా  విచ్చలవిడిగా  చెలరేగిపోతోంది, యువత నిర్వీర్యమవుతోంది.

నాడు విశాఖ ఐటీ హబ్ గా ఉంటే నేడు గంజాయి డెన్ గా మారింది. 

నాడు సంక్షేమానికి పెద్దపీట వేశాం, ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం 

తెలగాంణలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తే ఏపీలో రూ. 1.50 లక్షలు రుణమాఫీ చేశాం. 

ఆదరణ, అన్న క్యాంటీన్, పెళ్లికానుకలు, స్టడీ సర్కిల్స్, రంజాన్ తోఫా, అంబేద్కర్ విదేశీ విద్య, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి వంటి అనేక సంక్షేమ పధకాలు అమలు చేశాం,  3 ఏళ్లలోసంక్షేమం కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. 

సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ,  సంక్షేమంతో పాటు అభివృద్ది చేసి  ఆదాయం పెంచాం. 

2014-19 రాష్ట్రంలో 10.8 శాతం గ్రోత్ రేటు సాధించాం, ఇది దేశంలో ఒక రికార్డ్ , దాన్ని ఇప్పటివరకు వరకూ ఎవరూ  బ్రేక్ చేయలేరు. 

వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ది సాధించాం, నేడు రాష్ట్రం దిగజారిపోవడానికి ఎవరు కారణం?

విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ పట్నంలో IIM, పెట్రోలియం యూనివర్సిటీ, తాడేపల్లి గూడెం NIT ఏర్పాటు చేశాం.

విజయవాడ NID( నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్), మంగళగిరి లో ఎయిమ్స్ తెచ్చి పూర్తి చేశాం. నెల్లూరులో IITTM( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, తిరుపతిలో ఇండయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), IIT తెచ్చాం, శ్రీకాకుళం,ఒంగోలు, కర్నూలులలో IIIT లు పెట్టాము.

అమరావతి -  అనంతపూర్ హైవేని ప్లానింగ్ మార్చి   పులివెందులకు వెళ్లేలా చేసి భ్రష్టు పట్టించారు. 

రాష్ట్రంలోని రోడ్లన్నీ అద్వానంగా తయారయ్యాయి. 

టీడీపీ హయాంలో 24 వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం,  మరుగుదోడ్లు నిర్మించాం, ఎల్ ఈడీ బల్బులు వేశాం, కానీ నేడు గ్రామాల్లో అభివృద్ది శూన్యం. 

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి  కేసుల మాఫీకి తాకట్టు పెట్టారు.

కేసులు లాలూచీ చేసేందుకు రాజ్యసభ సీట్లు అమ్ముకుని విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు.  

ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ మెట్రో రైల్ , వైజాగ్ చైన్నై కారిడార్ వీటి గురించి కనీసం మాట్లాడటం లేదు. 

9 ఏళ్లైనా విభజన చట్టంలోని హామీలు పరిష్కారం కాలేదు.

2019లో ఏపీ ఆదాయం రూ. 66,786 కోట్లు తెలంగాణ ఆదాయం రూ.69, 620 కోట్లు 

నేడు ఏపీ ఆదాయం రూ. 94,916 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ. 1,32,175 కోట్లకు పెరిగింది,  అంటే రూ. 37, 259 కోట్లు ఏపీకంటే ఎక్కువ పెరిగింది దీనికి కారణం ఎవరు?  

వైసీపీ పాలనలో అప్పులు, అవినీతి, విద్వసం తప్ప అభివృద్ది లేదు, రాష్ట్రాని రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. 

జీతాలు అడిగితే ఉద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారు

వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాతో వేల కోట్లు దోచుంకుంటున్నారు.  

జగన్ కి , వైసీపి నేతలకు డబ్బు వ్యసనంగా మారిపోయింది,  రాష్ట్రంలో పరిస్ధితి చూస్తే బాదేస్తోంది.

తెలుగుజాతి అభివృద్ది కోసం నిరంతరం పని చేస్తాం, గాడి తప్పిన రాష్ట్రాన్ని పునర్మించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. 

పూర్ టు రిచ్ కార్యక్రమంతో 2047 నాటికి ఏపీలో పేదలు లేకుండా అందర్నీ కోటీశ్వరుల్ని చేస్తాం. 

వచ్చే ఎన్నికల్లో జరిగేది క్యాష్ వార్,  పేదలకు దోపిడిదారులకు జరుగుతున్న యుద్దం.

వైసీపీ నేతలు దోచుకున్నదంతా ప్రజలకు అప్పజెప్పే బాధ్యత టీడీపీదే.

మా మానిఫెస్టో అంశాలు కాపీ అని జగన్ చెప్పడం ఒక అర్థం లేని విమర్శ.

Comments