జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలి.



మచిలీపట్నం జూన్ 21 (ప్రజా అమరావతి);


జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాల



ని సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అధికారులను ఆదేశించారు.


బుధవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా పరిశ్రమలు,  ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు.



ఈ సందర్భంగా  సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహించాలని సూచించారు.


ఈ సమావేశంలో సింగిల్ డెస్క్ పాలసీ కింద వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు 50 దరఖాస్తులు రాగా 38 ఆమోదించారు.  నిబంధనల ప్రకారం సరిగా లేకపోవడంతో మిగిలిన  12 దరఖాస్తులను తిరస్కరించారు. 


ఏపీఐఐసీ స్థలాలు బదిలీ కోసం పెట్టుకున్న 12 దరఖాస్తులను కమిటీ ఆమోదించింది.


ప్యాకేజ్డ్ తాగునీటి ప్లాంట్లను  తనిఖీ చేయాలని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అన్ని ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్నారా లేదా గమనించాలని సంబంధిత అధికారులకు సూచించారు.


జిల్లాలో ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం  కోసం అవసరమైన స్థలం కావాలని కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపితే స్థలాలు గుర్తించి కేటాయిస్తామని  అధికారులకు  సూచించారు.


వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమం కింద  పారిశ్రామికవేత్తలు తమ ప్రాజెక్టుల కోసం  బ్యాంకు ద్వారా రుణాలు  పొందేందుకు మండలాల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.


సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సంబంధించిన పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, విద్యుత్తు రాయితీ, అమ్మకం పన్ను రాయితీ,  స్టాంపు డ్యూటీ రాయితీ తిరిగి చెల్లింపు భూమి మార్పు చార్జీల తిరిగి చెల్లింపు కింద  వచ్చిన 54 దరఖాస్తులను పరిశీలించి 39 క్లెయిములకు 3,48,85,248 రూపాయలను మంజూరు చేస్తూ కమిటీ తీర్మానించింది. మిగిలిన 15 దరఖాస్తులను కమిటీ తిరస్కరించడం జరిగింది.



ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఆర్. వెంకటరావు, ఎంఎస్ఎమ్ఈ డైరెక్టర్ జీ వరలక్ష్మి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సీతారాం, డిఐసి డిడి విజయ్ కుమార్ ఏపీఎస్ఎఫ్సి బి ఎం వెంకయ్య, కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ టి రాజు కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జోష్ణ ఎల్ డి ఎం జయవర్ధన్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్ వివి రావు వివిధ పారిశ్రామిక సంఘాల  ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments