సకాలంలో రీసర్వేను చేపట్టాలి.

 సకాలంలో రీసర్వేను చేపట్టాలి


  భూమి  లేని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీ చేయడానికి  ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ అనుమతి తీసుకోవాలి


 క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేయండి


*: జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 27 (ప్రజా అమరావతి): 


 రెవెన్యూ మరియు   సర్వే  అధికారులు బాధ్యతగా పనిచేయండి.జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రీసర్వే ప్రక్రియ, ఎఫ్పిఓఎల్ఆర్, మ్యుటేషన్స్, వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్ లు, డిఐఓలు, రీ సర్వే డిటీలు, మండల సర్వేయర్లు, తదితరులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రీసర్వేను వేగంగా చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా వివిధ రకాల ప్రక్రియలను సకలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

మండలాలలో  పురోగతి చాలా తక్కువగా సాధిస్తున్నారని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  ప్రతి ఒక్క తాసిల్దారు మరియు విలేజ్ సర్వేరు మరియు రీసర్వే డిప్యూటీ తాహల్దారు మీ చెరువులో తప్పులు లేకుండా సర్వే విజయవంతం చేయాలని తెలిపారు. తాహల్దారు పంపించిన డేటాను ఆర్డీవోలు పరిశీలించి జెసి లాగిన్ పంపాలని తెలిపారు.  ముటేషన్ బి అండ్ ఎస్ఎల్ఎ కు లేకుండా  వితిన్ ఇన్ ఎస్ ఎల్లో లో పూర్తి చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  గతవారం ఇచ్చిన రిసర్వ్   సూచనలపై శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగిందని తెలిపారు.  

గ్రామంలో  భూమి లేని నిరుపేదలను గుర్తించి  వారికి ల్యాండ్ అక్రిజేషన్ కమిటీ అనుమతి తీసుకోవడానికి కార్యచరణ ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులను హెచ్చరించారు.   క్షేత్రస్థాయిలో  రెవెన్యూ అధికారులు తిరగాలని  తెలిపారు

 జిల్లాలో రీసర్వేలో భాగంగా రెండవ, మూడవ విడతలో ఎంపిక చేసిన 180 గ్రామాల్లో చేపట్టిన రీసర్వే ప్రక్రియ జరుగుతోందని, ఆయా గ్రామాల్లో రీసర్వేను ఇచ్చిన గడువులోపు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిఎల్ఆర్ లో ఎంట్రీలు ఎలా చేయాలనే విషయం పై శిక్షణ ఇచ్చారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ కొండయ్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, రీసర్వే డిప్యూటీ తహసిల్దార్ క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.









Comments