మంగళగిరి టిడ్కో గృహాలకు నారా లోకేష్ సహకారంతో తాగునీరు సరఫరా.

 *మంగళగిరి టిడ్కో గృహాలకు నారా లోకేష్ సహకారంతో తాగునీరు సరఫరా


*


*రెండు మంచినీటి ట్యాంకర్లను పంపించి మొత్తం 5 ట్రిప్పుల తాగునీటిని సరఫరా చేయించిన నారా లోకేష్*


*నారా లోకేష్ కు ధన్యవాదములు తెలియజేసిన టిడ్కో గృహాల నివాసితులు*


మంగళగిరి, జూన్ 16 (ప్రజా అమరావతి): మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో తాగునీటిని సరఫరా చేసే మోటార్ మరమ్మత్తులకు గురి కావడంతో తాగునీటికి అంతరాయం ఏర్పడింది.  దీనితో తాగునీటి కోసం టిడ్కో గృహాల నివాసితులు ఇబ్బంది పడుతున్నారు. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంటనే స్పందించారు. శుక్రవారం నాడు జలధార పేరుతో రెండు మంచినీటి ట్యాంకర్లను పంపించి మొత్తం 5 ట్రిప్పుల తాగునీటిని సరఫరా చేయించారు. వాటర్ ట్యాంకర్లను పంపి తాగునీటిని సరఫరా చేయించిన నారా లోకేష్ కు టిడ్కో గృహ సముదాయంలోని నివాసితులు ధన్యవాదములు తెలిపారు. మంచినీటి పునరుద్దరణ జరిగే వరకు ట్యాంకర్ ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు తెలియజేశారు.

Comments