ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల.


ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల



ఇంటర్ రెగ్యూలర్ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హజరైన వారి సంఖ్య 2,51,653.

ఓకేషనల్  విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హజరైన వారి సంఖ్య 26,735

ప్రైవేటు విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హజరైన వారి సంఖ్య 38,666. 

రిజల్ట్స్ కోసం WWW. bie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు ధరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ ఈ నెల 23.

 

విజయవాడ (ప్రజా అమరావతి): ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ ఏడాది 2,51,653 హజరయ్యారని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు తెలిపారు. తాడేపల్లిలోని ఇంటర్మీడీయట్ బోర్డ్ కార్యాలయంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఎంవీ శేషగిరి బాబు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంవీ శేషగిరి బాబు మాట్లాడుతూ ఇంటర్ ఒకేషనల్ కోర్స్ సప్లిమెంటరీకి 26,735 మంది విద్యార్థులు, ప్రైవేటు విద్యార్థులు 38,666 మంది విద్యార్థులు హజరైనారని చెప్పారు. 

          ఇంటర్ మొదటి సంవత్సరం బెటర్ మెంట్ కోసం 1,69,347 మంది పరీక్షలకు హజరైనట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల కోసం WWW.bie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చన్నారు.  

           ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మొత్తం 84.35 శాతం ఉత్తీర్ణత సాధించారని  ఎంవీ శేషగిరి బాబు తెలిపారు. మొదటి ఏడాది మార్చి మరియు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 4,16,639 హజరుకాగా మార్చిలో 2,66,326 మంది, అడ్వాన్స్ సప్లిమెంటరీలో 56,767 (77.54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్చి మరియు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు మొత్తంగా 3,73,341 మంది హజరుకాగా మార్చిలో 2,72,001, అడ్వాన్స్ సప్లిమెంటరీలో 42,931(84.35 శాతం) మంది ఉత్తీర్ణులైయ్యారని వివరించారు. 

      ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బెటర్ మెంట్ కోసం పరీక్షకు 1,69,347 మంది హజరుకాగా 1,41,733(83.69 శాతం) మంది ఇంప్రూవ్ మెంట్  సాధించారన్నారు. ఈ విద్యాసంవత్సరం మార్చిలో ఫెయిలైన విద్యార్థులు 1,50,313 మంది సప్లిమెంటరీ పరీక్షకు హజరుకాగా 56,767(37.77 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం  మార్చిలో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీకి 1,01,340 మంది హజరుకాగా 42,931(42.36 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ప్రైవేటు విద్యార్థులు 38,666 మంది అడ్వాన్స్ సప్లిమెంటరీకి హజరుకాగా 14,395(37.22 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 

            ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో  బాలికలు 86.46 శాతం, బాలురు 81.99 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలు 80.56 శాతం, బాలురు 74.34 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారని చెప్పారు.

                  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 88.38 శాతం మంది ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా, కడప 63.32 శాతంతో చివరి స్థానంలో నిలిచిందని, కృష్ణా జిల్లా తరువాత వరుసగా నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించినట్లు చెప్పారు. 

                 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పశ్చిమ గోదావరి జల్లా  97.32 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా కృష్ణా, నెల్లూరు జిల్లాలు నిలిచాయన్నారు. చివరి స్థానంలో కడప 75.95 శాతం ఉత్తీర్ణత సాధించి నిలిచిందన్నారు. 

         ఒకేషనల్ మొదటి సంవత్సరం మార్చి, అడ్వాన్స్ సప్లిమెంటరీ  పరీక్షా ఫలితాల్లో 78.53 శాతం పాసైయ్యారని, ద్వితీయ సంవత్సరం 84.69 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొత్తం మొదటి సంవత్సరం 33,131 మంది హజరవ్వగా 26,019 మంది, ద్వితీయ సంవత్సరంలో మొత్తం 30,413 విద్యార్థులు హజరవ్వగా 25,758 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఈ నెల 23లోపు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్ట్ జాయింట్ సెక్రటరీలు పి. సుశీల,  శ్రీనివాసులు, ఉధ్యోగులు పాల్గొన్నారు. 


Comments