వసతి గృహ సంక్షేమ అధికారులు అందరూప్రధాన కార్యాలయం స్థానంలోనే నివాస ఉండాలి
విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంక్షేమ అధికారులపై సస్పెండ్ చేయడం జరుగుతుంది
జిల్లా కలెక్టర్
పుట్టపర్తి, జూన్ 9 (ప్రజా అమరావతి): జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులందరూ ప్రధాన కార్యాలయ స్థానంలోని నివాసం ఉండాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు
శుక్రవారం స్పందన హాల్ ప్రత్యేక సమావేశం మందిరంలోశ్రీ సత్య సాయి జిల్లాలోని సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ, వెనుకబడి తరగతిలో సంక్షేమ శాఖల వసతిగృహమునందు పనిచేయుచున్న, వసతి గృహ సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి శివ రంగ ప్రసాద్, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిడి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ అనగా రేపటి రోజు శనివారము, మరియు ఆదివారము, జిల్లాలోని సంక్షేమ అధికారులు మరియు సహాయ సంక్షేమ అధికారులందరూ వసతి గృహాలను సందర్శించి వసతి గృహాలు ఎలా ఉన్నాయో వాటిని పరిశీలించి వసతుగృహాలన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని అధికారులను హెచ్చరించారు. వసతి గృహాలలో ఆవరణలో ముళ్ళ చెట్లు, పొదలు, పిల్లల మంచంలు, డైనింగ్ హాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వసతి గృహాల ఆవరణలో ఎలాంటి పాములు రాకుండా చూసుకోవాలని, వసతి గృహాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పరిసరాలు శుభ్రంగా లేనట్లు, పాములు కనబడిన, నా దృష్టికి వచ్చినట్లయితే, ఆయా వసతి సంక్షేమ అధికారులపై కచ్చితంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది, దానితోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో వసతి గృహాల లో అడ్మిషన్ సీట్లు కావాలని నాకు ఎలాంటి దరఖాస్తు రాకూడదని హెచ్చరించారు. వివిధ సంక్షేమ వసతి గృహాలలో 100 శాతం అడ్మిషన్ ఉండాలని తెలిపారు. ఎస్సీ సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులు గ్రామాలలో పర్యటించి, పిల్లలను వసతి గృహంలో చేర్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలలో పిల్లలు అందరికీ వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాలలో సంక్షేమ అధికారులు అందరూ ఉదయం సమయం, రాత్రి సమయం హాస్టల్లో ఉండి పిల్లలు చదువు పట్ల వారి పరిజ్ఞానం ఎలా ఉందని తెలుసుకొని వారిని అభివృద్ధి పథంలో పయనించుటకు మీరు కృషి చేయాలని తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం అమలులో భాగంగా వసతి గృహ విద్యార్థులు అందరూ మధ్యాహ్నం భోజనం పథకాన్ని స్వీకరించరా లేదా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం జిల్లాస్థాయి అధికారులందరూ పలు కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని. త్వరలో వివిధ సంక్షేమ వసతి గృహాలను సందర్శిస్తారని తెలిపారు. సంక్షేమ వసతి గృహ అధికారులందరూ ప్రధాన కార్య స్థానంలోని నివాసం ఉండే అడ్రస్ జాబితాను ఆయా సంక్షేమ వసతి గృహ జిల్లా అధికారికి జాబితాను అందజేయాలి. ఒక జాబితాను నాకు అందజేయాలని తెలిపారు క్షేత్రస్థాయిలో నా పర్యటనలో ఆకస్మికంగా హాస్టల్లో తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. తనిఖీల సమయంలో విధులలోనిర్లక్ష్యం వహించిన అధికారులపై కచ్చితంగా వేటు వేయడం జరుగుతుందని తెలిపారు. హాస్టల్ కి సంబంధించిన రికార్డులన్నీ సక్రంగా ఉండాలని తెలిపారు. మెనూ ప్రకారమే పిల్లలకి మంచి పౌష్టిగా ఆహారం అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంక్షేమ వసతి గృహ అధికారులు రెడ్డి బాలాజీ, నరసింహారావు. శ్రీరాములు, రాజు కులయప్ప, బాలాజీ. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment