ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం.



*క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.*


అమరావతి (ప్రజా అమరావతి);

*ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.* 

*కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తంచేసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.*

*ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యోగ సంఘాలు.* 



*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*

– ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం.


– ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములు.

–  ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది.

– మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. 


– అందుకే పెన్షన్స్‌ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డాం:

– గతంలో ఎవ్వరూ కూడా ఒక పరిష్కారం కోసం ఇంత తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు.

– ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

– దీన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీసుకువచ్చాం. 

– రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం.

–బేసిక్‌ జీతంలో 50 శాతం అంటే రూ.1లక్ష జీతం ఉంటే రూ.50 వేలు రిటైర్‌ అయిన తర్వాత వస్తుంది.

– 62 ఏళ్లకు రిటైర్‌ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి. 


– అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం.

– ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలి.

– సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. దీనికోసం రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది.

– దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశాం. 

న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు మంచి జరగాలని ప్రతి అడుగులో కనిపించే విధంగా చేశాం. ఇది సంతృప్తినిచ్చే అంశం.

- అసలు చాలామంది ఎఫర్ట్‌ కూడా పెట్టరు.

– ఇంత ఆలోచన చేయాల్సిన పని ఏముందని అనుకుంటారు. అలా చేస్తే పరిష్కారం రాదు. తొలిసారిగా ఓ పరిష్కారం దిశగా తీసుకెళ్లే కార్యక్రమం చేశాం.


*కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశాం.*

– సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నాం.

– వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం.

– నా దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు పదేళ్లను విండోగా నిర్ణయించారు. మరీ ఆలస్యమవుతుందని ఐదేళ్లకు తగ్గించాం. గరిష్టంగా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం.


– అలాగే వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం.

010 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుకు వచ్చినట్లుగా వీరికి జీతాలు సమయానికి రావు. పోస్ట్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌లో కూడా వ్యత్యాసం ఉంది. 

– వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. వీటన్నింటిపైనా ధ్యాసపెట్టి మనస్ఫూర్తిగా మంచి జరగాలని చేశాం.

– ఇంకా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా, మీ మొహంలో కూడా చిరునవ్వు ఉండేటట్టు చేస్తాం. 

– మీరు బాగుంటే ప్రజలకూ మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది.

Comments