విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.

 *విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం**జగనన్న ఆణిముత్యాల కింద అందిస్తున్న నగదు పురస్కారాలను సద్వినియోగం చేసుకోవాలి*


*: విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


*విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*


*: మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 17 (ప్రజా అమరావతి):


జగనన్న ఆణిముత్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆకాంక్షించారు. పుట్టపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కింద జిల్లా స్థాయి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ నళిని, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులతో ఉన్నత చదువులకు వెళ్తున్న విద్యార్థులను సన్మానించి వారి కష్టాన్ని, కృషిని కింది తరగతి విద్యార్థులకు తెలియజేస్తే వారు కూడా మోటివేట్ అవుతారని, వారికి ప్రోత్సాహకంగా ఉంటుందని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇప్పటికే పాఠశాల, నియోజకవర్గస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈరోజు జిల్లాస్థాయిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి పారితోషికం అందిస్తూ అభినందిస్తున్నామన్నారు. ఇంతకుముందుతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలు ఎంతో అడ్వాన్స్డ్ స్థాయిలో ఉన్నాయని, దానికి 2019 వ సంవత్సరం నుంచి విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడమే కారణమన్నారు. నాడు - నేడు కింద జిల్లాలో మొదటి విడతలో ఎంపిక చేసిన అన్ని పాఠశాలలను అభివృద్ధిపరచుకున్నామని, రెండవ విడుతలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని విద్యార్థులను బాగా చదివించాలని అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ పథకం కింద 15 వేలు అందించడంతో విద్యార్థులను ఎలాంటి భారం లేకుండా పాఠశాలకు పంపించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ కావాలంటే డిమాండ్ ఏర్పడిందని, దానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, వసతులు, విద్యా కానుక, బుక్స్, యూనిఫామ్ అందించడం, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కారణమన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అక్కడ మానేసి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని, ఇదొక మంచి పరిణామమని, ఇందుకోసం కృషిచేసిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లాలో రోళ్ల లాంటి మారుమూల ప్రాంతం నుంచి 590కిపైగా ఇద్దరు విద్యార్థులు మార్కులు తెచ్చుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. చదివించేందుకు ఆర్థిక స్తోమత లేకపోతే తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా సహాయం చేస్తామన్నారు. చదువుతున్న పిల్లలను ప్రోత్సహించాలని, అదే మన అందరి బాధ్యత అని, అందరూ కష్టపడి చదువుకోవాలన్నారు. జగనన్న ఆణిముత్యాలు కింద అందిస్తున్న నగదు పురస్కారాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదువుకునేందుకు కృషి చేయాలన్నారు.


ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు కింద పాఠశాల, కళాశాలల నుంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించడం ఎంతో సంతోషకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంతగా సీఎం జగనన్న విద్యారంగానికి అనేక రకాలుగా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విద్యారంగంపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు. విద్యార్థుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి 15వేల రూపాయలు అందిస్తున్నారని, ఇది విద్యార్థుల బాగుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జగనన్న గోరుముద్దు కింద మంచి భోజనం అందిస్తున్నారని, విద్యా కానక ద్వారా యూనిఫామ్, షూ, బెల్ట్ లాంటి 9 రకాల వస్తువులు ఇస్తున్నారని, విద్యా దీవెన, వసతి దీవన కింద ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ విద్యార్థులను ఆదుకుంటున్నారన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో నాడు- నేడు పథకాన్ని ప్రవేశపెట్టి మూడు విడతలుగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన, ట్యాబ్ల పంపిణీ, పోటీపరీక్షల్లో పోటీపడేలా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంటే ఎడ్యుకేషన్ హబ్ గా మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు బాగా చదివించాలని సూచించారు. జగనన్న ఆణిముత్యాలు కింద అందించిన ప్రతిభా పురస్కారాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు బాగా చదివితే గుర్తింపు ఉంటుందనేది ఈ పురస్కారాల వల్ల తెలుస్తుందన్నారు. విద్యార్థులు ప్రతిభ చూపించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డారని వారందరికీ అభినందనలు తెలిపారు.


జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగానికి పెద్ద పీట వేస్తూ విద్యార్థుల కోసం అనేక రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు.


అనంతరం జిల్లాలో పాఠశాల స్థాయి, నియోజకవర్గస్థాయి మరియు జిల్లాస్థాయిలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రథమ కనబరిచిన విద్యార్థులకు 47 లక్షల 15 వేల రూపాయల నగదు పురస్కారాన్ని, ప్రశంసా పత్రాలను, మేమెంటోళ్లను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు అందజేశారు. జిల్లాలో మొత్తం 1,026 మంది విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు కింద నగదు పురస్కారాలకు ఎంపిక కావడం జరిగింది. పాఠశాల స్థాయిలో 926 మంది విద్యార్థులకు, నియోజకవర్గ స్థాయిలో 47 మంది విద్యార్థులకు, జిల్లా స్థాయిలో 53 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది.


పాఠశాల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు 3,000 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన వారికి 2,000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన వారికి 1,000 రూపాయల పారితోషికం అందించడం జరిగింది. నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెడల్ తో సత్కరించారు.


నియోజకవర్గస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు 15,000 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన వారికి 10,000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన వారికి 5,000 రూపాయల పారితోషికం అందించడం జరిగింది. నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెడల్, మెమెంటోతో సత్కరించారు.


జిల్లాలో స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు 50,000 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన వారికి 30,000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన వారికి 10,000 రూపాయల పారితోషికం అందించడం జరిగింది. నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెడల్, మెమెంటోతో సత్కరించారు.


ఈరోజు పదవ తరగతికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో 29 మంది విద్యార్థులకు, ఇంటర్ కి సంబంధించి 24 మంది విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెడల్, మెమెంటోతో సత్కరించారు. ఇంటర్లో గ్రూపుల వారిగా ఉత్తమ ప్రతిభ చూపిన వారికి నగదు పురస్కారంతో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెడల్, మెమెంటో అందించారు. విద్యార్థులకు 47 లక్షల 15 వేల రూపాయల నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందించారు.


ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భాగ్యరేఖ, ఎంపీపీ రమణారెడ్డి, పుడా చైర్మన్ లక్ష్మీ నరసమ్మ, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, ఇంచార్జి డిఈఓ రంగస్వామి, వార్డు కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, విద్యాశాఖ ఏడీలు నాగరాజు, రాజర్, ఎంఈఓ వెంకటరమణ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.Comments