భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.

 *- భవిష్యత్ గ్యారెంటీపై  టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల


*

- *పార్టీ శ్రేణులతో కలిసి నందివాడ మండలం జనార్ధనపురంలో పర్యటన*

- *భవిష్యత్ గ్యారెంటీపై ఇంటింటికి వెళ్లి గ్రామస్తులకు అవగాహన*

 - *మినీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలన్నింటిని అమలు చేస్తాం*

- *తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము* 



గుడివాడ, జూన్ 8 (ప్రజా అమరావతి): రాజమహేంద్రవరం మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో ఆ పార్టీ నాయకులు వెనిగండ్ల రాము ప్రజల్లోకి వెళ్ళారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండలం జనార్ధనపురం గ్రామంలో టిడిపి శ్రేణులతో కలిసి వెనిగండ్ల పర్యటించారు. ముందుగా మినీ మేనిఫెస్టోతో గ్రామానికి వచ్చిన వెనిగండ్లకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినిగండ్ల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మేరీ మాత విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం వెనిగండ్ల ఇంటింటికీ వెళ్ళి గ్రామస్థులను కలుసుకున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టోలో ఉన్న కీలక పథకాలపై వెనిగండ్ల గ్రామస్థులకు అవగాహన కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికీ మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని తెలిపారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో 18ఏళ్ళు నిండిన మహిళలకు స్త్రీ నిధి కింద నెలకు రూ.1500లు నేరుగా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏటా రూ. 15వేలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణ సౌకర్యాన్ని చంద్రబాబు కల్పించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు ఆర్ధికసాయం అందించి వారికి చేయూతగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20వేల ఆర్థికసాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం ద్వారా వారికి అన్నివిధాలా అండగా నిలుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ.3వేలు అందిస్తామని, నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలను చంద్రబాబు కల్పిస్తారని తెలిపారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలు, యువతకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే టీడీపీ అధికారంలోకి వస్తే ఏ ఏ కార్యక్రమాలు చేపడతామో ప్రజలకు తెలియజేస్తున్నామని వెనిగండ్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో జనార్దనపురం గ్రామ ప్రముఖులు మలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గూడపాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా చంటి, అరికేపూడి రామశాస్త్రిలు, రాధాకృష్ణ, ఏసు పాదం, సిరిపురపు తులసీరాణి, బొంబాయి శ్రీను, లింగం చిట్టిబాబు, మేరుగు మోజెస్, గడ్డం ప్రకాష్ దాస్, సుబ్బారావు, రవి తదితరులు పాల్గొన్నారు.

Comments